సిపిఐ జెండా ఆవిష్కరణ

Dec 26,2023 20:31
ఫొటో : సిపిఐ జెండా ఆవిష్కరిస్తున్న ఎపి రైతుసంఘం నాయకులు బలిజేపల్లి వెంకటేశ్వర్లు

ఫొటో : సిపిఐ జెండా ఆవిష్కరిస్తున్న ఎపి రైతుసంఘం నాయకులు బలిజేపల్లి వెంకటేశ్వర్లు
సిపిఐ జెండా ఆవిష్కరణ
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 99వ అవిర్భావం దినోత్సవం సందర్భంగా మంగళవారం సిపిఐ కార్యాలయంలో పార్టీ జెండాను ఎపి రైతుసంఘం నాయకులు బలిజేపల్లి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఎనలేని పాత్ర వహించిందని కార్మిక కర్షక రైతు వ్యవసాయ కార్మికల కోసం అలుపెరగని పోరాటాలు సాగించిందన్నారు. ఒక్క శాతం ఉన్న పెట్టుబడిదారీవర్గం 99శాతంగా ఉన్న శ్రమజీవుల కష్టార్జీతాన్ని లాభం పేరుతో దోచుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుత సమాజంలో సోషలిజాన్ని నిర్మించుకోవడం అనివార్యమని కార్మిక వర్గం ప్రజా పోరాటలలో భాగస్వాములు కావలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనాలోచిత కారణంగా పెద్ద నోట్ల రద్దీ జిఎస్‌టి అమలు కరోనా నియంత్రణలో విఫలం, రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన నరేంద్ర మోడీ మట్టి నీళ్లతో సరిపెట్టడం, మూడు రాజధానుల పేరిట ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నాటకాలు అడడం కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్న పరిస్థితుల్లో దేశ, రాష్ట్ర ప్రజలు రాజధాని రైతులు నడి రోడ్డున పడ్డరని ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సాగనంపాలని అందులో భాగంగా సిపిఐ నిర్వహించే పొరాటాలలో అన్నివర్గాల ప్రజలు కలసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కొప్పర్తి నాగరాజు, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అద్యక్షులు దమ్ము దర్గాబాబు, మున్సిపాలిటీ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షులు మల్లి అంకయ్య, అధ్యక్షులు నారయణ, తదితరులు పాల్గొన్నారు.

➡️