సిఎఎ రద్దయ్యే వరకూ పోరాటం : సిపిఎం

ప్రజాశక్తి-మదనపల్లి పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) రద్దు అయ్యే వరకూ పోరాటం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు హెచ్చరించారు. సిఎఎ నిబం ధనల నోటిఫికేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక బెంగళూరు బస్టాండ్‌ సర్కిల్‌లో రాస్తారోకో నిర్వహించారు. మతోన్మాద బిజెపి డౌన్‌డౌన్‌, సిఎఎ రద్దు చేయాలని, భారత రాజ్యాంగం కాపాడు కుందాం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లా డుతూ పౌరస త్వాన్ని మతపరమైన గుర్తింపుతో ముడిపెట్టడం ద్వారా రాజ్యాం గంలో పొందుప రచిన పౌరసత్వం యొక్క లౌకిక సూత్రాన్ని సిఎఎ ఉల్లంఘి స్తుందని వివరిం చారు. పొరుగు దేశాల నుండి వచ్చే ముస్లింల పట్ల కూడా ఈ వివక్షాపూరిత విధానాన్ని అమలు చేసేలా ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ముస్లిం మూలా లు ఉన్న పౌరుల్ని కూడా లక్ష్యంగా చేసుకుంటారనే భయాం దోళనలను పెంచు తోందని వివరించారు. సిఎఎని వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభు త్వాలను మినహాయిం చడానికి రాష్ట్రాలకు పౌరసత్వం కల్పించేందుకు అవకాశం లేకుండా నిబంధనలు రూపొందించబడ్డాయని వివరించారు. సిఎఎను ఆమో దించిన నాలుగేళ్ల తర్వాత, లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు కొద్దిరోజుల ముందు ఈ చట్టం నిబం ధనల నోటిఫికేషన్‌ వెలువడటం అంటే, తమ ప్రయోజనాల కోసం సిఎఎ అమ లును ఉపయోగించాలని బిజెపి కోరుకుంటుందని స్పష్టమవు తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని అమలు చేయబోదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పష్టం చేశారని, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ రాష్ట్రాలు కూడా సిఎఎను తీవ్రంగా వ్యతిరేకించాయని పేర్కొన్నారు. మత విద్వేషం రెచ్చగొట్టి అధి కారంలోకి రావాలని కుట్రలు పన్నుతున్న బిజెపితో రాష్ట్రంలో ఉన్న టిడిపి, జన సేన పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. అధికార వైసీపి పార్టీ బిజెపితో లోపా యికారిగా అంటకాగుతున్ననే సిఎఎను వ్యతిరేకిం చలేక పోతు న్నాద టన్నారు. సిఎఎ అమలును, ఈ హానికరమైన ఈ చట్టాన్ని రద్దు చేసే వరకూ సిపిఎం పోరాడుతుందని పేర్కొన్నారు. మద్దతు తెలిపిన బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీచందు మాట్లాడుతూ భారత రాజ్యాంగ హక్కులను హరించిన సిఎఎను అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు డి.ప్రభాకర్‌రెడ్డి, అంజాద్‌, నాగరాజు, వెంకటేష్‌, చాన్‌ బాష, అశోక్‌ పాల్గొన్నారు.

➡️