సమ్మె ఆపేది లేదు

Dec 23,2023 21:46

12వ రోజుకు అంగన్‌వాడీల ఉద్యమం
తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె శనివారంతో 12వ రోజుకు చేరుకుంది. సమస్యలు పరిష్కరించేవరకూ సమ్మె ఆపేది లేదని అంగన్‌వాడీలు స్పష్టం చేశారు.
ప్రజాశక్తి – భీమవరం రూరల్‌
ప్రభుత్వం స్పందించి అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీల సమ్మె శిబిరాన్ని ఆయన సందర్శించి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలు పరిష్క రించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు డి.త్రిమూ ర్తులు, డి.నాగు, ఎం.ఆంజనేయులు, కృష్ణ పాల్గొన్నారు. పెంటపాడు : తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె శనివారంతో 12వ రోజుకు చేరుకుంది. పెంటపాడులో అంగన్‌వాడీలు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ యూనియన్‌ అధ్యక్షురాలు శ్యామలకుమారి, ఆర్‌.అనురాధ, సిఐటియు నాయకులు బంకురు నాగేశ్వరరావు, సిపిఎం మండల కార్యదర్శి పుల్లారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆకుల నారాయణ, కడప ఆంజనేయులు, బుద్దాల నాని, మద్దాల పుత్రయ్య, గాది వెంకట్రావు, కృష్ణ పాల్గొన్నారు.గణపవరం : అంగన్‌వాడీల సమ్మెకు రైతు సంఘం నాయకులు దండు రామలింగరాజు మద్దతు తెలిపారు. అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి ఎండి హసినాబేగం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ మండల నాయకులు బి.రామకోటి, కెవి.మ హాలక్షి, ధనలక్షి, కల్యాణి, ఎస్‌.జయలక్ష్మి పాల్గొన్నారు. ఆచంట (పెనుమంట్ర) : పెనుమంట్ర తహశీల్దార్‌ కార్యాలయం వద్ద చేపట్టిన సమ్మెకు అంగన్‌వాడీ జిల్లా కార్యదర్శి డి.కల్యాణి, సహాయ కార్యదర్శి కానూరు తులసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కల్యాణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కోడి శ్రీనివాసప్రసాద్‌, సాయి మహా లక్ష్మి, మౌనిక, సరస్వతి రేనీల, దుర్గా సూర్యకుమారి, భాగ్య లక్ష్మి, సరస్వతి, సూర్యప్రభ, సుశీల, శాంతి పాల్గొన్నారు. పాలకొల్లు : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సమ్మెకు రైస్‌ మిల్లు కార్మికులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి జవ్వాది శ్రీని వాస్‌, ఎం.శ్రీదేవి, బి.నాగలక్ష్మి, పి.పద్మ, ఎంఎ.నర్సమ్మ, జెపి.పద్మనాగలక్ష్మి, జి.ఝాన్సీరాణి, ధనలక్ష్మి, కె.సత్యవతి పాల్గొన్నారు.తాడేపల్లిగూడెం : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్‌ ప్రాజెక్టు అధ్యక్షురాలు డి.స్వరూపారాణి, సిఐటియు పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ మాట్లాడారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రనంలో ప్రభారాణి, కనకమహాలక్ష్మి, వరలక్ష్మి, ప్రసన్న, గాయత్రి, వీరమ్మ, యడవల్లి వెంకన్న పాల్గొన్నారు.మొగల్తూరు : అంగన్‌వాడీల దిక్షా శిబిరాన్ని ఆశావర్కర్లు సందర్శించి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దింట్లు, సారమ్మ, సీత, రేఖ శాంభవి, రాజి పాల్గొన్నారు.అత్తిలి : స్థానిక కార్యాలయం వద్ద అంగన్‌వాడీల సమ్మెకు కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు బి.విజరుకుమార్‌ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.కల్యాణి, జిల్లా సహాయ కార్యదర్శి కె.తులసి, కౌలు రైతు సంఘం నాయకులు కేతా గోపాలన్‌, సిఐటియు నాయకులు కర్రి ధర్మేంద్ర పాల్గొన్నారు.పోడూరు : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు పిల్లి ప్రసాద్‌, ప్రాజెక్ట్‌ లీడర్‌ పీతల రాజమణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జె.ఉమాదేవి, రాయుడు కుమారి పాల్గొన్నారు.నరసాపురం టౌన్‌ : స్థానిక అంబేద్కర్‌ సెంటర్‌లో దీక్షా శిబిరంలో అంగన్‌వాడీలు మెడలో ఎర్ర రిబ్బన్లు వేసుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీలు డి.విజయలక్ష్మి, కె.భోగేశ్వరి, జి.శివరంజని, ఆర్‌.ఏసమ్మ, జి.వెంకటలక్ష్మి, జి.ఝాన్సీ, లక్ష్మి, జి.రాజేశ్వరి, బి.వెంకటలక్ష్మి, సిఐటియు పట్టణ కార్యదర్శి పొన్నాడ రాము పాల్గొన్నారు. ఉండి : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీల సమ్మెకు సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి.గోపాలన్‌ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీల మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎం.చైతన్య, డి.సత్యవేణి, అంగన్‌వాడీలు సిహెచ్‌.కుసుమ, ఝాన్సీ, జయశ్రీ, సిఐటియు మండల అధ్యక్షులు ధనికొండ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.పెనుగొండ : పెనుగొండ పంచాయతీ పార్కు వద్ద చేస్తున్న సమ్మెను ఉధృతం చేస్తూ జిల్లా అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ అధ్యక్షురాలు డి.కల్యాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా కల్యాణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీల పెనుగొండ మండల అధ్యక్షురాలు కె.తులసి, సిఐటియు నాయకులు గంగా రావు, అంగన్‌వాడీలు నాగలక్ష్మి, పరమేశ్వరి, త్రివేణి, రాధ, పద్మ కుమారి, వెంకటలక్ష్మి ,దుర్గ తదితరులు పాల్గొన్నారు. ఆచంట : ఆచంట కచేరి సెంటర్‌లో అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె శనివారం 12వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు సిఐటియు నాయకులు వెంకటేశ్వ రరావు, కార్యవర్గ సభ్యులు సుర్నిడి వెంకటేశ్వరరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నాగిరెడ్డి గంగారం, మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు కేతా పద్మజ, అనంత, మండల కార్యదర్శి వద్దిపర్తి అంజిబాబు, మైలే విజయలక్ష్మి, కమల, మహేశ్వరి, శ్రీదేవి, నాగలక్ష్మి, వెంకటలక్ష్మి, సుజాతకుమారి పాల్గొన్నారు.కాళ్ల : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షల్లో అంగన్‌వాడీ టీచర్లు విప్లవ గీతాలు ఆలపించి పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం జీతాలు పెంచాలని, గ్రాడ్యూటీ ఇవ్వాలని, సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండలాధ్యక్షులు గొర్ల రామకృష్ణ, కార్యదర్శి మండా సూరిబాబు, అంగన్‌వాడీ సెక్టార్‌ లీడర్స్‌ యడవల్లి చంద్రావతి, ఝాన్సీలక్ష్మీబాయి, కమల, రాజమణి, ఝాన్సీ, టీచర్స్‌, హెల్పర్స్‌ పాల్గొన్నారు. ఆకివీడు : అంగన్‌వాడీల దీక్ష శిబిరంలో 20 మంది పాల్గొన్నారు. సిఐటియు నాయకులు కె.తనిటినాయుడు మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ తర్వాత సమ్మె మరింత ఉధృతం అవుతుందని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు పెంకే అప్పారావు, అంగన్‌వాడీ నాయకులు ఇరానీదేవి, వి.పైడే శ్వరి, కనకదుర్గ, సీతామహాలక్ష్మి, బేబిరాణి, ఎ.అమ్మాజీ, కె.కృష్ణకుమారి, పి.శివలక్ష్మి, జయకృష్ణవేణి పాల్గొన్నారు.యలమంచిలి : అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్‌ చేశారు. దీక్షలో సిఐటియు మండల కార్యదర్శి దేవ సుధాకర్‌, నాయకులు రజిని, పద్మశ్రీ, దేవి పాల్గొన్నారు.

➡️