సమస్యలపై అంగన్‌వాడీల పోరుబాట

అంగన్‌వాడీ వర్కర్లు

ప్రజాశక్తి- రాజమ హేంద్రవరం ప్రతినిధిజిల్లాలో అంగన్‌వాడీ సిబ్బంది పోరు బాటకు సిద్ధమవుతున్నారు. తమ సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు గతంలో సమరశీల పోరటాలు నిర్వహించిన విషయం విదితమే. అదే స్ఫూర్తితో మరో ఉద్యమానికి సిద్ధమయ్యారు. 2019 ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా తెలంగాణ కంటే అదనపు వేతనం చెల్లిస్తామని, సమస్యలను పరిష్కరిస్తామని వైస్‌.జగన్మోహన్‌రెడ్డి హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పూర్తిగా విస్మరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర యూనియన్‌ పిలుపు మేరకు డిసెంబరు 8 నుంచి సమ్మె చేయాలని నిర్ణ యించుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ శాఖ ఉన్నతాధికారులకు సమ్మె నోటీసు అందించారు. జిల్లాలోని 7 ప్రాజెక్టుల పరిధిలో 1,536 మెయిన్‌, 26 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు చొప్పున 1,562 ఉన్నాయి. మెయిన్‌ కేంద్రాల్లో ఒక వర్కర్‌, హెల్పర్‌తో కలిపి మొత్తం 3,072 మంది.. మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో 26 మంది వర్కర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా తమ కేంద్రాల పరిధిలో గర్భిణులు, బాలింతలకు పాలు, గుడ్లతో పాటు అదనపు పౌష్టికాహారాన్ని అందస్తూ మాతా, శిశు మరణాల రేటును తగ్గిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కీలక సేవలందిస్తూ పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సమ్మెబాటపడుతున్నారు.క్షేత్రస్థాయికి మాతా శిశు సంక్షేమ శాఖ సేవలు మాతా, శిశు సంక్షేమ శాఖ సేవలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంతో అంగన్‌వాడీలు కీలకంగా పనిచేస్తున్నారు. విధులలో భాగంగా ఆరు నెలల పసిబిడ్డ నుంచి మూడేళ్ల పిల్లలకు అదనపు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. లబ్ధిదారులు, అంగన్వాడీల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి విడనాడాలి, ఐసిడిఎస్‌ను బలోపేతం చెయ్యాలి. ఐసిడిఎస్‌ ఏర్పడిన తర్వాత మాతా శిశుమరణాలు తగ్గించడంలో విశేష కృషి జరిగింది. దేశంలో వెనుకబడిన ప్రాంతాల్లో పిల్లల విద్యలో ఎంతో మార్పు వచ్చిందని ప్రభుత్వ నివేదికలే స్పష్టంగా చెబుతున్నాయి. ఐసిడిఎస్‌ను పటిష్టపరుస్తామని ప్రధానమంత్రులు పార్లమెంట్‌ వేదికగా ప్రకటించారు. కానీ అభివద్ధి లేకపోగా ప్రైవేటు, స్వచ్చంద సంస్థలకు ఐసిడిఎస్‌ పథకాలను అప్పగించే వినాశకర విధానాలకు బిజెపి తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. గత ఎన్నికల్లో సిఎం జగన్‌ ఇచ్చిన హామీలను వచ్చేనెల 8వ తేదీలోపు నెరవేర్చకుంటే సమ్మె తప్పదని అంగన్‌వాడీ నాయకులు స్పష్టం చేశారు. అంగన్‌వాడీలకు అదనంగా జీతం ఇస్తామని చెప్పి నేటికీ పట్టించుకోకపోవడం, పని భారం పెంచడం, కనీస వేతనం ఇవ్వక పోవడం, మినీ సెంటర్‌ను మెయిన్‌ సెంటర్‌గా మార్చాలని కోరుతున్నా పట్టించుకోకపోవడం పట్ల అంగన్‌వాడీలు ఆగ్ర హంగా ఉన్నారు. పోరుబాటే శరణ్యమని అర్బన్‌ ప్రాజెక్టుల వద్ద మంగళవారం ఆందోళన నిర్వహించారు.అంగన్‌వాడీల డిమాండ్లుఅంగన్‌వాడీలకు తెలంగాణ కంటే అందనంగా వేతనాలు పెంచాలి. ఫేస్‌ యాప్‌ విధానం రద్దు చేయాలి. పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలి. వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలి. గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలి. 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న టిఎ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి. మినీ వర్కర్లకు పదోన్నతులు, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ రూ.5 లక్షలు పెంచాలి. ఆఖరి వేతనంతో 50 శాతం పెన్షన్‌ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. హెల్పర్ల ప్రమోషన్‌ల వయో పరిమితి 50 ఏళ్లకు పెంచాలి. ప్రమోషన్‌లలో రాజకీయ జోక్యం అరికట్టాలి. సర్వీసులో ఉండి చనిపోయిన వర్కర్‌, హెల్పర్‌ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలని తదితర డిమాండ్‌లు చేశారు. సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న

➡️