సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు

శ్రీప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌: మున్సిపల్‌ పరిధిలో ప్రధాన సమస్యలైనా తాగునీరు, డంపింగ్‌ యార్డ్‌ సమస్యలు శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపడుతున్నట్లు స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. మంగళవారం మున్సిపల్‌ పాలకవర్గ సభ్యులు, అధికారులు, సిబ్బంది అంతా కలిసి తోటపల్లి ప్రాంతం పరిధిలో గల పంప్‌హౌస్‌ను క్షేత్రస్థాయిలో పట్టణానికి తాగునీరు అందజేసే అతి ప్రధానమైన పంప్‌ హౌస్‌, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పట్టణ ప్రధాన సమస్యలు తాగునీరు, డంపింగ్‌ యార్డు సమస్యల పరిష్కారానికి శాశ్వతంగా కృషి చేస్తామన్నారు. ఇప్పటికే మంచి నీటి సరఫరాకు రూ.63.33 కోట్లు నిధులు మంజూరు చేయగా రూ.3 కోట్లు వరకు పనులు జరిగాయని, మిగిలిన పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు చెప్పారు. దీనితో పాటు డంపింగ్‌ యార్డు ప్రధాన సమస్యకు కూడా త్వరలోనే జిల్లా అధికారుల సహకారంతో పరిష్కరిస్తా మని తెలిపారు. ఈ రెండు సమస్యలను వచ్చే ఎన్నికల్లోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటా మన్నారు. అలాగే తోటపల్లి మంచి నీరు పంపు హౌస్‌ ప్రాంతంలో గల స్థలాన్ని అంతటినీ కంచే వేసి అవసరమైన చోట మొక్కలు నాటడం, అలాగే అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం చేప ట్టడం జరుగుతుందని తెలిపారు. అనంతరం తోటలో అందరితో కలిసి ఎమ్మెల్యే వనభోజనం కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బి.గౌరీ శ్వరి, వైస్‌ చైర్మన్‌ కొండపల్లి రుక్మిణి, పట్టణ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, ఫ్లోర్‌ లీడర్‌ మంత్రి రవికుమార్‌, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్‌ కమిషనర్‌ రామప్పలనాయుడు, అధికారులు, సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️