సత్తెనపల్లిలో ‘ఆసరా’ చెక్కులు పంపిణీ

సత్తెనపల్లి రూరల్‌: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నాలుగు విడతలలో డ్వాక్రా రుణ మాఫీ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి, తన మాట నిలబెట్టుకున్నారని జల వనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ ఆవరణలో మంగళవారం జరిగిన పొదుపు సంఘాల ఆసరా వారోత్సవాలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసం గించారు. ముందుగా ముఖ్యమంత్రి జగ న్మోహన్‌ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు గత ఎన్నికల సమ యంలో రైతు, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి హామీని చెత్తలో పడేసి దుర్మా ర్గపు పాలన చేశారని విమర్శించారు. ఒక్క జగన్మోహన్‌రెడ్డి మాత్రం ఇచ్చిన మాట మేరకు రూ.2,570 కోట్లను డ్వాక్రా రుణ మాఫీ చేశారన్నారు. అనం తరం పట్టణంలోని 702 సంఘాలలో 6,936 మంది సభ్యులకు గాను రూ.5.68 కోట్లు, రూరల్‌ మండల పరిధిలోని 1318 సంఘాలకు చెందిన 12,859 మంది సభ్యులకు గాను రూ.10.91 కోట్ల ఆసరా నమూనా చెక్కులను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో గుంటూరు ఏఎంసి చైర్మన్‌ నిమ్మకాయల రాజ నారాయణ ఉన్నారు.

➡️