సచివాలయం ప్రారంభం

Jan 21,2024 21:44
ఫొటో : మాట్లాడుతున్న ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి

ఫొటో : మాట్లాడుతున్న ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి
సచివాలయం ప్రారంభం
ప్రజాశక్తి-ఉదయగిరి : మండలంలోని క్రిష్ణంపల్లి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాలను ఆదివారం నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు సంతోషంగా ఆనందంగా జీవించాలంటే ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన నవరత్నాలు మళ్లీ అందాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అందుకు ప్రతిఒక్కరూ ఆశీర్వాదం ఉండాలన్నారు. కరోనా విపత్కర తరుణంలో జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఆదుకున్నారన్నారు. అనంతరం సొంత నిధులు వెచ్చించి సచివాలయం ఆర్‌బికె హెల్త్‌ క్లినిక్‌ ఓకే చోటు ఉండేందుకు భూమిని కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టిన సాహిత్య అకాడమీ డైరెక్టర్‌ సర్పంచ్‌ అక్కి ప్రమీల భాస్కర్‌ రెడ్డిని అభినందించారు. ముందుగా సమన్వయ కర్త మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు నాయకులు కార్యకర్తలు కార్యక్రమంలో మాజీ ఎంపిపి చేజర్ల సుబ్బారెడ్డి, జెడ్‌పిటిసి మోడీ రామాంజనేయులు, మండల కన్వీనర్‌ ఓబుల్‌ రెడ్డి, జిల్లా కోఆప్షన్‌ సభ్యులు గాజుల తాజుద్దీన్‌, సర్పంచులు అక్కి ప్రమీల, ముత్తుకొందు నారాయణమ్మ, జెసిఎస్‌ మండల కన్వీనర్‌ కృష్ణారెడ్డి, 8 మండలాల జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు, ఎంపిటిసిలు, సర్పంచులు, రాష్ట్ర, జిల్లా, మండల వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️