సందడిగా క్రిస్మస్‌ వేడుకలు

జిల్లావ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలను సోమవారం సందడిగా

కేక్‌ తినిపిస్తున్న ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

జిల్లావ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలను సోమవారం సందడిగా నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే చర్చిల్లో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఏసుక్రీస్తును స్తుతిస్తూ గీతాలను ఆలపించారు. శ్రీకాకుళం చిన్నబజారులోని తెలుగు బాప్టిస్టు చర్చి, ఉమెన్స్‌ కాలేజ్‌ రోడ్డులోని క్రిస్టియన్‌ వర్షిప్‌ సెంటర్‌, కోడి రామ్మూర్తి స్టేడియం సమీపంలోని సెయింట్‌ జాన్‌ లూథరన్‌ చర్చి, డగ్లస్‌ స్కూల్‌ క్యాంపస్‌లోని కీన్‌స్టోన్‌ చర్చి, పాత శ్రీకాకుళంలోని రార్డ్‌ అసెంబ్లీ చర్చి, పురుషుల డిగ్రీ కళాశాల సమీపంలోని సహాయ మాత (ఆర్‌సిఎం) చర్చి, టౌన్‌హాల్‌ వద్ద సెయింట్‌ థామస్‌ చర్చితో పాటు జిల్లావ్యాప్తంగా పలు చర్చిల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని చిన్న బజారు రోడ్డులో బాప్టిస్టు చర్చిలో ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, దమ్మలవీధిలోని చర్చిలో మాజీ ఎమ్మెల్యే గుండ లకీëదేవి, ఇచ్ఛాపురంలోని బాప్టిస్టు చర్చిలో ఎమ్మెల్యే బెందాళం, జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ పిరియా విజయ పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, ఉమ్మడి జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు గొండు శంకర్‌ శ్రీకాకుళం నగరంలో దుస్తులు పంపిణీ చేశారు. క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. పాస్టర్లు క్రీస్తు సందేశం చదివి వినిపించారు. పలుచోట్ల పేదలకు దుస్తులు పంపిణీ చేశారు.

 

➡️