సంతృప్తికర రీతిలో అర్జీలు పరిష్కరించాలి

Mar 11,2024 23:16

‘స్పందన’లో 179 అర్జీలు స్వీకరణ
కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌
ప్రజాశక్తి – ఏలూరు
‘జగనన్నకు చెబుదాం-స్పందన’ కార్యక్రమంలో అందిన దరఖాస్తులను ప్రజలకు సంతృప్తికర రీతిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లాస్థాయి జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌, జాయింట్‌ కలెక్టర్‌ బి.లావణ్యవేణి, డిఆర్‌డిఎ పీడీ డాక్టర్‌ ఆర్‌.విజయరాజు, ఆర్‌డిఒ ఎన్‌ఎస్‌కె.ఖాజావలీ, డిప్యూటీ కలెక్టర్‌ భానుశ్రీతో అర్జీలు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్పందనకు 179 అర్జీలు అందాయన్నారు. ప్రజల నుండి అందే విజ్ఞప్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత పరష్కార విధానంపై ప్రజలు సంతృప్తి చెందని కారణంగా దరఖాస్తులు రీఓపెన్‌ అవతున్నాయన్నారు. స్పందన దరఖాస్తులు రీఓపెన్‌ కాని రీతిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా అధికారులు, సిబ్బంది అర్జీదారులకు నాణ్యమైన పరిష్కార ఎండార్స్‌మెంట్‌ అందజేయాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.ఎంఎస్‌ఎంఇ సర్వేను వేగవంతం చేయాలి: కలెక్టర్‌ జిల్లాలో ర్యాంప్‌ స్కీమ్‌ కింద చేపట్టిన మైక్రో, స్మాల్‌, మీడియం ఎంటర్‌ప్యూనర్స్‌ (ఎంఎంఎస్‌ఎంఇ) సర్వేను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ఆదేశించారు. సోమవారం స్థానిక గోదావరి సమావేశ మందిరంలో ఎంఎస్‌ఎంఇ సర్వేపై సంబంధిత అధికారులు, ఎంపిడిఒలు, కమిషనర్లకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో తయారీ, సేవ, వాణిజ్యం రంగాలకు సంబంధించి 74 వేల సర్వీసులకు సర్వే చేసి వాటిని డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకుని ఎంఎస్‌ఎంఇని అనుసంధానం చేయించాలన్నారు. జిల్లాలో ఇటీవల చేపట్టిన ఈ సర్వేలో భాగంగా ఇంతవరకు 1,590 పూర్తయిందని, మిగిలిన సర్వే ప్రక్రియను మూడు రోజుల్లో గణనీయమైన ప్రగతిలోకి తీసుకురావాలన్నారు. దీనిలో పంచాయతీరాజ్‌ ఎస్‌ఇ, ఎపిఇపిడిసిఎల్‌ ఎస్‌ఇ, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపిడిఒలు, జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్‌తో సమన్వయం చేసుకోవాలన్నారు. దీనికోసం ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు, ఎపిఇపిడిసిఎల్‌ ఎనర్జీ సెక్రటరీల సేవలను వినియోగించుకోవాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ బి.లావణ్యవేణి మాట్లాడుతూ అందరికీ ఇళ్లకు సంబంధించి ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ డి.పుష్పమణి, ఆర్‌డిఒ ఎన్‌ఎస్‌కె.ఖాజావలి, డిఆర్‌డిఎ పీడీ డాక్టర్‌ ఆర్‌.విజయరాజు, డిప్యూటీ కలెక్టర్‌ భానుశ్రీ పాల్గొన్నారు.

➡️