శ్రీవారిని దర్శించుకున్న విశ్రాంత సీజే ఎన్వీ రమణ

తిరుమల : సుప్రీం కోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ మంగళవారం కుటుంబ సమేతంగా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు రమణ కుటుంబ సభ్యులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో 15 కంపార్టుమెంట్లు నిండిపోగా , టోకెన్లు లేని యాత్రికులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 78,731 మంది యాత్రికులు దర్శించుకోగా 25,156 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.40 కోట్లు వచ్చిందని వివరించారు.

➡️