శాస్త్రీయ అవగాహనతో మూఢనమ్మకాలకు చెక్‌జెవివి రాష్ట్ర విజ్ఞాన కళాయాత్ర ప్రదర్శనలు

శాస్త్రీయ అవగాహనతో మూఢనమ్మకాలకు చెక్‌జెవివి రాష్ట్ర విజ్ఞాన కళాయాత్ర ప్రదర్శనలు

శాస్త్రీయ అవగాహనతో మూఢనమ్మకాలకు చెక్‌జెవివి రాష్ట్ర విజ్ఞాన కళాయాత్ర ప్రదర్శనలుప్రజాశక్తి – తిరుపతి సిటి మూఢవిశ్వాసాల వల్ల జరిగే అనర్ధాలను పాటలు, నృత్యాలు, చిరు నాటిక రూపాల్లో కళాకారులు ప్రదర్శించి శాస్త్రీయ అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర విజ్ఞాన కళాయాత్ర ఫిబ్రవరి 5న శ్రీకాకుళంలో ప్రారంభమై బుధవారం తిరుపతి ముత్యాలరెడ్డిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చేరుకుంది. విజ్ఞాన వినోద, మ్యూజిక్‌ కళా ప్రదర్శనలతో విద్యార్థులను ఉర్రూతలూగించారు. శాస్త్రీయ అవగాహన, పర్యావరణ రక్షణ, అందరికీ సమాన విద్యావకాశం తదితర సమస్యలపై చక్కని కళారూపాలు ప్రదర్శించారు. దొంగ స్వాముల బండారం బట్ట బయలు చేసే శ్రీ రాములు మేజిక్‌ ప్రదర్శన విద్యార్థులను ఉర్రూతలూగించింది. ఈ కార్యక్రమం రాష్ట్ర విజ్ఞాన వేదిక అధ్యక్షులు మురళీధరన్‌ – త్రిమూర్తులు, జిల్లా అధ్యక్షుడు చెంగయ్య, రఫీ ఆధ్వర్యంలో జరిగింది. అతిథులు ఎంఇవో బాలాజీ, ప్రముఖులు టెంకాయల దామోదరం, రోటరి రాజకుమార్‌, నారాయణ, నాగార్జున, వెంకట రమణ పాల్గొన్నారు. బహుమతులను, ప్రసంశ పత్రాలను అందజేశారు.

➡️