శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలి

Dec 3,2023 23:18
ఎస్‌ఐ టి.రామకృష్ణ,

ప్రజాశక్తి – పెదపూడి

సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కు ప్రజలందరూ సహకరించాలని ఎస్‌పి సతీష్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. మండలంలోని పెద్దాడ గ్రామంలో ఆదివారం సాయంత్రం గ్రామస్తులకు వారథి కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ హెల్పెట్‌ ధరించకపో వడంతో చాలా మంది వాహనదారులు ప్రమాదవ శాత్తు రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతు న్నారని అన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ రోడ్డున పడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు హెల్మెట్‌ విధిగా ధరించాలన్నారు. యువత చెడు అలవాట్లుకు బానిస అవుతున్నారని, డ్రగ్స్‌, ఇతర మత్తుకు లోనై విలువైన జీవితాన్ని, భవిష్య త్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. మత్తుపై యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండి ఉన్నత జీవితాన్ని కొనసాగిం చాలని సూచించారు. ఈ సందర్భంగా సైబర్‌ క్రైమ్‌ గురించి వివరించారు. సైబర్‌ క్రైమ్‌ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైసిపి ఎస్‌సి విభాగం నాయకుడు దిమ్మల రాజుబాబు మాట్లా డుతూ గ్రామాల్లో, జిల్లా ఉన్నత పోలీసు అధికా రులు నిర్వహిస్తున్న వారధి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చట్టాలపై అవగాహన పెంచుకుని నేరాలు, చెడు అలవాట్లుకు దూరంగా ఉండి ఉన్నతమైన జీవితాన్ని గడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్‌ సిఐ కె.శ్రీనివాసు, ఎస్‌ఐ టి.రామకృష్ణ, ఎఎస్‌ఐ వి.శ్రీనివాసు, స్థానిక పెద్దలు, యువత పాల్గొన్నారు.

➡️