వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు రాజ్యాంగం రక్షణ : పిఒ

 ప్రజాశక్తి – పార్వతీపురం: దేశంలోని ప్రతి వ్యక్తి స్వేచ్చా స్వాతంత్య్రలతో జీవించేందుకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తుందని ఐటిడిఎ ప్రాజెక్ట్‌ అధికారి సి.విష్ణుచరణ్‌ తెలిపారు. స్థానిక ఐటిడిఎలోని గిరిమిత్ర సమావేశ మందిరంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ అధికారి మాట్లాడుతూ విభిన్న భాషలు, సంస్కతులు, జాతులతో కూడిన భారతదేశంలో అన్ని మతాలు, జాతుల వారికి సమాన హక్కులు కల్పిస్తూ రాజ్యాంగం రూపొందించిందన్నారు. ప్రభుత్వ వ్యవస్థ నిర్వహణలో రాజ్యాంగం ప్రతి వ్యవస్థకు అధికారాలు, పరిమితులు విధించిందని, ప్రతి వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరిస్తూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అభివృద్ధి చెందుతూ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు, బాధ్యతలను కూడా స్వీకరిస్తూ, దేశ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వెలుగు ఎపిడి సత్యం నాయుడు, ఐటిడిఎ సిబ్బంది పాల్గొన్నారు.కలెక్టరేట్‌లో….పార్వతీపురంరూరల్‌ : రాజ్యాంగ దినోత్సవాన్ని కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ పీఠిక పఠించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టరు పి.కిరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ మహౌన్నత ఆశయంతో రాజ్యాంగానికి రూపకల్పన చేసిన డాక్టర్‌ బి ఆర్‌ అంబేద్కర్‌ను దేశం ఎన్నటికీ మరువదన్నారు. అంబేద్కర్‌ సారధిగా ఏర్పాటైన డ్రాఫ్టింగ్‌ కమిటీ భిన్నత్వ సమ్మేళితమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఎంతగానో శ్రమించారని, మనం అంతా గర్వించదగిన రాజ్యాంగాన్ని రూపొందించడానికి అవిశ్రాంతంగా శ్రమించిన గొప్ప మేధావులకు ఘనమైన నివాళి అందించేందుకే ఈ ప్రత్యేక దినం వేడుకలా జరుపుకుంటున్నామని కొనియాడారు. వారి ఆశయాలకు ఆదర్శంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. డిఇఒ ఎన్‌.ప్రేమ కుమార్‌ మాట్లాడతూ డా.బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 125వ జయంతి పురష్కరించుకొని 2015 నుండి భారత రాజ్యాంగాన్ని దత్తత చేసుకున్న నవంబర్‌ 26 తేదిన రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌, జిల్లారెవెన్యూ అసోసియేషను అధ్యక్షులు శ్రీరామ్మూర్తి, మార్కెటింగు శాఖ ఎడి ఎల్‌. అశోక్‌కుమార్‌, కలెక్టరు కార్యాలయ సిబ్బంది, గిరిజన సంక్షేమ సంఘఉత్తరాంద్ర ప్రధాన కార్యదర్శి పి. రంజిత్‌ కుమార్‌, సంఘ సభ్యులు పాల్గొన్నారు.పార్వతీపురం టౌన్‌ : భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శమని స్థానిక శాసనసభ్యులు అలజంగి జోగారావు అన్నారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఆదివారం పట్టణ ప్రధాన రహదారిలో ఉన్న డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అంబేద్కర్‌ స్ఫూర్తితో, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్మన్లు, వివిధ మండలాల ఎంపిపిలు, జెడ్‌పిటిసి సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, వైస్‌ ఎంపిపిలు, వార్డు కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, వైసిపి సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, సచివాలయం కన్వీనర్లు, గృహసారధులు, మేధావులు, పాల్గొన్నారు.సీతంపేట: స్థానిక ఐటిడిఎలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగంలోని ప్రవేశ పీఠిక ప్రతిజ్ఞ చేశారు. భారత రాజ్యాంగంలోని చట్టాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎపిఒ వై.రోసిరెడ్డి, ఇఇ ఎస్‌.సింహాచలం, సిడిపిఒ పి.రంగలక్ష్మి గురుకులం సెల్‌ ఇంచార్జ్‌ వెంకటేశ్వర్లు, ఎఇ మోహన్‌, గోపాల్‌, ఎపిఒ సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.కురుపాం : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు టి.శంకరావు ఆధ్వర్యంలో ఆదివారం జరిగే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంఇఒ ఎన్‌.సత్యనారాయణ హాజరై రాజ్యాంగ నిర్మాతలైన బాబు రాజేంద్రప్రసాద్‌, డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలనేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎ. జగదీశ్వరరావు, సంతోష్‌ కుమార్‌ పండ, విద్యార్థులు పాల్గొన్నారు.పాలకొండ : భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ సందర్భంగా డాక్టర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైసిపి పట్టణ అధ్యక్షులు వెలమల మన్మధ రావు, పాలవలస ధవళేశ్వరరావు, నీలాపు శ్రీను, కోరికాన గంగునాయుడు, కిల్లారి మోహన్‌, దుప్పాడ పాపినాయుడు, తూముల లక్ష్మణరావు, దుంపల రమేష్‌, కోరాడ రవి, సుంకరి ధర్మ, రెడ్డి కేశవరావు, కోట మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.సీతంపేట రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో, భారత సంవిధాన ప్రతిజ్ఞ ను చేసి, పిల్లలకు భావి భారత పౌరులుగా రాజ్యాంగ విలువలను, స్వేచ్ఛ స్వాతంత్య్రం సమానత్వం సౌభ్రాతృత్వం పాటించాలని సందేశం ఇచ్చారు. అలాగే ధారపాడు పంచాయతీలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ చిత్రం పటానికి పూలమాలవేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ కె..గీతాంజలి, శంభాం కార్యదర్శి వి.వినోద్‌, ఎపిఒ సాగర్‌, ధారపాడు సర్పంచ్‌ సుందరమ్మ కార్యదర్శి అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.వీరఘట్టం : మండలంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కంబరవలస జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు వై.లక్ష్మి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతర విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే చిట్టపూడివలసలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఎస్‌.రాంబాబు విద్యార్థులతో గ్రామంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో ఎ.వెంకటరావు, ఎం.ధనుంజయనాయుడు, టి.ప్రశాంతి, డిటివి రత్నం, ఎస్‌.రవికుమార్‌, ఎ.చంద్రమోహన్‌, పి.శ్రీదేవి, వి.శ్రీను, విద్యార్థులు పాల్గొన్నారు.సాలూరు: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని శ్రీ వెంకట విద్యాగిరి పాఠశాలలో విద్యార్ధులకు నిర్వహించిన క్విజ్‌ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌ కోడూరు సాయి శ్రీనివాసరావు రాజ్యాంగం గొప్పతనం గురించి వివరించారు. కార్యక్రమంలో హెచ్‌ ఎం కోడూరు లక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.భామిని: స్థానిక అంబేద్కర్‌ కూడలిలో వైసిపి మండల కన్వీనర్‌ తోట సింహాచలం ఆధ్వర్యంలో నాయకులు, ప్రజా ప్రతినిధులు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి ప్రసాదరావు, వైసిపి నాయకులు పోతల మజ్జి, బొమ్మాలి సంజీవరావు, కొల్ల రామారావు, రొక్కం రమేష్‌, గేదెల మోహన్‌ రావు, పోతల హరికృష్ణ, పాఠశాల విద్యార్థినిలు పాల్గొన్నారు.

➡️