వైసిపి అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : పల్లె

Jan 25,2024 21:36

సమావేశంలో మాట్లాడుతున్న పల్లె రఘునాథరెడ్డి

                      పుట్టపర్తి అర్బన్‌ : వైసిపి ప్రభుత్వం, ఆపార్టీ నాయకులు చేస్తున్న అరాచకాలు దౌర్జన్యాలు గురించి ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్‌ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణకు సంబంధించి సిబ్బంది మాట్లాడుతూ సాంకేతిక విధానం పార్టీ ప్రతిష్టకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియజేశారు. మాజీ మంత్రి పల్లె మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్‌ శిక్షణ ద్వారా అనేక ఫలితాలు పొందబోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్టిఎస్‌ పార్లమెంట్‌ కోఆర్డినేటర్‌ మనోహర్‌ నాయుడు, పోల్‌ మేనేజ్మెంట్‌ పార్లమెంట్‌ కోఆర్డినేటర్‌ వెంకటరమణ, ఐటిడిపి పార్లమెంట్‌ అధ్యక్షుడు రామాంజనేయులు, పార్టీ పరిశీలకులు బచ్చలి పుల్లయ్య, టిడిపి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, నాయకులు మహమ్మద్‌ రఫీ, పుల్లప్ప, దయ్యాల ఉమాపతి, నాయకులు పాల్గొన్నారు. ఓబుళదేవర చెరువు : స్థానిక ఐటిఐ కళాశాలలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి ఇంటిగ్రేటెడ్‌ శిక్షణా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈసందర్భంగా ట్రైనింగ్‌ సిబ్బంది మాట్లాడుతూ సాంకేతిక విధానం పార్టీ ప్రతిష్టకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియజేశారు. టీడీపీ యాప్‌ ఉపయోగించి ఎంతటి చిన్న సమస్యనైనా త్వరిత గతిన పార్టీలోని అగ్ర నాయకులకు చేరే విధంగా సమస్యలతో పాటు ఆలోచనలో కూడా పంచుకోవడానికి వీలుగా ఉంటుందని వివరించారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని పార్టీ పటిష్టతకు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్‌టిఎస్‌ పార్లమెంటు కొర్డినేటర్‌ మనోహర్‌ నాయుడు, పోల్‌ మేనేజ్మెంట్‌ పార్లమెంట్‌ కోఆర్డినేటర్‌ వెంకటరమణ, ఐడీటీపీ పార్లమెంటు అధ్యక్షులు రామంజనేయులు, మండల న్వీనర్‌ జయచంద్ర, మాజీ జెడ్పిటిసి పిట్ట ఓబుల్‌ రెడ్డి, బూదిలి ఓబుల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️