విష్ణు శరవణన్‌కు ఒలింపిక్స్‌ బెర్త్‌

Jan 31,2024 22:23 #Sports

ఆడిలైడ్‌: 2023 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన భారత సెయిలర్‌ విష్ణు శరవణన్‌ పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. సెయిలింగ్‌ క్రీడాంశంలో భారత్‌ నుంచి అర్హత సాధించిన తొలి సెయిలర్‌ విష్ణునే కావడం గమనార్హం. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ వేదికగా జరుగుతున్న ఐఎల్‌సిఎ-7 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రాణించిన విష్ణు శరవరణ్‌ పారిస్‌ బెర్తును దక్కించుకున్నాడు. ఈ ఈవెంట్‌లో ఆసియా ఖండం నుంచి ఏడు బెర్తులు ఉండగా.. ఆసియా గేమ్స్‌తో పాటు ఇటీవల కాలంలో మెరుగ్గా రాణిస్తూ ర్యాంకుల పంట పండిస్తున్న హాంకాంగ్‌, థాయ్ లాండ్‌, సింగపూర్‌ సెయిలర్లను శరవణన్‌ వెనక్కినెట్టడం విశేషం. ఆర్మీలో ప్రస్తుతం సుబేదార్‌గా పనిచేస్తున్న 24ఏళ్ల విష్ణు.. ఓవరాల్‌గా ఈ ఈవెంట్‌లో 174స్కోరు చేశాడు. మొత్తంగా 152 మంది పాల్గంటున్న ఈ ఈవెంట్‌లో విష్ణు 26వ స్థానంలో, ఆసియా దేశాల తరఫున అగ్రస్థానంలో నిలిచాడు.

➡️