విరాళాలు అందించాలి

ప్రజాశక్తి-దొనకొండ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు సాగిస్తున్న సిపిఎంకు ప్రజలు విరాళాలు అందించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు తెలిపారు. స్థానిక వివిపురంలో ఉద్యమ నిధి కోసం సిపిఎం కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి విరాళాలు సేకరించారు. విరాళాలను సేకరణను ఆంజనేయులు ప్రారంభించి మాట్లాడారు. ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తించాలన్నారు. జిల్లాలో కరువు, వలసలు నివారించి, ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణం చేపట్టాలని అందుకోసం సిపిఎం అనేక ఉద్యమాలు చేపట్టిందన్నారు. పెరుగుతున్న ధరలు అరికట్టాలని, పాలకులు ప్రజలపై మోపుతున్న భారాలను నిలువరించాలని, ప్రభుత్వ త్యాగాలతో స్ధాపించుకున్న ప్రభుత్వ రంగ సంస్ధలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పోరేట్‌ సంస్ధలకు కట్టబెడుతుంటే సిపిఎం అడ్డుకు నేందుకు అనేక ఉద్యమాలు చేసిందన్నారు. ఈనెల 1 నుంచి 10 వరకూ ప్రజల వద్ద విరాళాలు సేకరించనున్నట్లు తెలిపారు. ప్రజలు విరివిగా విరాళాలు ఇచ్చి ఆదరించాలన్నారు. ప్రజా ఉద్యమాలను బలపర్చాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం దర్శి నియోజకవర్గ నాయకులు తాండవ రంగారావు, మండల కార్యదర్శి చిరుపల్లి అంజయ్య, కార్యకర్తలు కుందుర్తి అనిల్‌, కర్ణా కృష్ణ, అంజిబాబు, మేళం సంతోష్‌, బండారు శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. కొండపి: ప్రజా ఉద్యమాల కోసం నిధిసేకరిస్తునట్లు సిపిఎం మండల నాయకులు కెజి.మస్తాన్‌ తెలిపారు. మండల పరిధిలోని మిట్టపాలెం గ్రామంలో గురువారం విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా మస్తాన్‌ మాట్లాడుతూ ఈనెల 1 నుంచి 15 వరకూ ప్రజలకు వద్దకెళ్లి నిధులు సేకరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి.వందనం, పిచ్చయ్య, ఎస్తేరమ్మ, అంకయ్య తదితరులు పాల్గొన్నారు. 

➡️