విద్యాభివృద్ధికి అధిక నిధులు : మంత్రి పెద్దిరెడ్డి

ప్రజాశక్తి-ఓబులవారిపల్లె (పుల్లంపేట) దేశంలో ఎక్కడా లేనివిధంగా పేద విద్యార్థుల సంక్షేమానికి అధిక నిధులు ఖర్చు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమ వారం ఓబులవారిపల్లె మండలం, తల్లెంవారిపల్లె, గ్రామంలో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, వైయస్సార్‌ రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు ధనుంజయరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సిఎం జగన్‌ గతంలో ఎప్పుడూ ఎన్న డూ ఎవరూ చేయని విధంగా విద్యాభివద్ధికి అధిక నిధులు ఖర్చు చేసి పేద విద్యార్థుల సంక్షే మానికి కషి చేశారని పేర్కొ న్నారు. విద్యార్థులు అంటే ఎంతో ఇష్టమని విద్యార్థులకు యూని ఫాం, టై, బెల్టు, బూట్లు, బ్యాగు, పుస్తకాలు, నాణ్యమైన పౌష్టి కాహారం ఇస్తూ కన్న తల్లిదం డ్రులు కూడా చూసుకోలేని విధం గా జగనన్న విద్యార్థులను ఎంతో ప్రేమతో చూసుకుంటున్నారన్నా రు. ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో జగనన్న విద్యాదీవెన, విద్యాకానుక, విదేశీ విద్య వంటి పథకాలను ప్రవేశపెట్టి పేద విద్యార్థుల సంక్షేమానికి కషి చేశారన్నారు. గతంలో మేము స్కూల్‌కి వెళ్లాలంటే ఆర్థిక ఇబ్బం దులతో ఎంతో కష్టపడేవారమని నేడు ప్రభుత్వం విద్యార్థులకు అన్ని సౌక ర్యాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించారని తెలిపారు. ప్రతి విద్యార్థి చక్కగా చదివి ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రుల ఆశలు నెరవే ర్చాలన్నారు. విద్యతోనే సమాజం బాగుపడుతుందన్న మంచి ఉద్దేశంతో ప్రతి జిల్లాలో ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ ద్వారా 35 లక్షల వరకు పేదల వైద్యానికి ఖర్చు చేయడం జరుగుతుం దన్నారు. ఇలా నిరంతరం ప్రజల సంక్షేమమే తమ ధ్యేయంగా పనిచే స్తున్న ముఖ్యమంత్రికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ముఖ్యమంత్రి సలహాదారులు ధనుంజయరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల రాష్ట్రంలో ఎన్నో అభివద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పిల్లల చదువులు తల్లిదం డ్రులకు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో విద్య, ఆరోగ్యానికి ఎక్కువ నిధులు ఖర్చు చేశారన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయాలని ఉద్దేశంతో వాలంటీర్‌, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను పేదల ముంగిటకు తీసుకెళ్లడం జరిగిందన్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారని తెలి పారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ పథకాన్ని ప్రవేశపె ట్టారన్నారు. కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా అభివద్ధి చేసిందన్నారు. విద్యార్థులు అసౌకర్యానికి గురికాకుండా విశాలమైన పాఠశాలల గదులు బెంచీలు, విద్యుత్తు, మరుగు దొడ్లు, రన్నింగ్‌ వాటర్‌, ఆర్వో ప్లాంట్‌ వంటి అన్ని వసతులు విద్యార్థులకు ఏర్పాటు చేశామన్నారు. తల్లెంవారిపల్లెలో ముఖ్యమంత్రి సలహాదారులు ధనుంజయరెడ్డి సహకారంతో రూ.2.10 కోట్లతో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కరు గర్వించదగ్గ విషయ మన్నారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివద్ధి పథకాలు అమలు చేశారన్నారు. కార్యక్రమంలో ఎస్‌పి కృష్ణారావు, ఆర్‌జెడి రాఘవరెడ్డి, ఆర్‌డిఒ మోహ న్‌రావు, డిఇఒ శివ ప్రకాష్‌రెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ పంజం సుకుమార్‌రెడ్డి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ కొండూరు అజరురెడ్డి, కొల్లం గంగిరెడ్డి, గుంతకల్‌ రైల్వే బోర్డు మెంబర్‌ తల్లెం భరత్‌ కుమార్‌రెడ్డి, మండల కన్వీనర్‌ సాయి కిషోర్‌రెడ్డి, పుల్లంపేట ఎంపిపి ముద్దా బాబుల్‌రెడ్డి, ఉపాధ్యాయుడు పొత్తపి నరసింహారెడ్డి పాల్గొన్నారు.

➡️