విజేతలకు బహుమతులు అందజేత

Feb 5,2024 21:10

 ప్రజాశక్తి-విజయనగరం :  జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా గతనెల 24న విద్యార్ధులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తత్వం, డ్రాయింగ్‌ పోటీల విజేతలకు సోమవారం కలెక్టరేట్లఓ కలెక్టర్‌ నాగలక్ష్మి బహుమతి ప్రదానం చేశారు. ఒక్కో విభాగంలో ప్రథమ బహుమతి కింద రూ.5వేలు, ద్వితీయ బహుమతికి రూ.3వేలు, తృతీయ బహుమతి కింద రూ.2వేలు అందజేశారు. వ్యాసరచన పోటీలో వై.యశ్వంత్‌ (జెడ్‌పిహెచ్‌ఎస్‌, కెల్ల, గుర్ల మండలం), వై.ప్రణతి (జెడ్‌పిహెచ్‌ఎస్‌, కుమిలి, పూసపాటిరేగ), బి.మానస (ఎంజెపిబిసిడబ్ల్యూఆర్‌ఎస్‌, నెల్లిమర్ల) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. వక్తత్వ పోటీలో పి.సౌభాగ్య (జెడ్‌పిహెచ్‌ఎస్‌, నెల్లిమర్ల), పి.శేషాచార్యులు (ఎపిఎంఎస్‌, మదనాపురం, గంట్యాడ మండలం), ఎం.కీర్తి (కెజిబివి, తెర్లాం) బహుమతులు గెలుచుకున్నారు. డ్రాయింగ్‌ పోటీలో బి.దుర్గాలక్ష్మి (ఎంజెపిబిసిడబ్ల్యూఆర్‌ఎస్‌, నెల్లిమర్ల), జి.నాని (జెడ్‌పిహెచ్‌ఎస్‌, పిఎస్‌ఆర్‌ పురం, గంట్యాడ), ఎ.హారిక (బిపిఎం హైస్కూల్‌, విజయనగరం) బహుమతులు గెలుచుకున్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, డిఇఒ బి.లింగేశ్వరరెడ్డి, డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️