విజయ్ తో ఎంతో అనుబంధం

Feb 1,2024 19:23 #movie, #Rashmilka Mandanna

హీరో విజయ్ దేవరకొండతో తనకు ఎంతో అనుబంధం ఉందని హీరోయిన్‌ రష్మిక మందన్న చెప్పారు. తాజా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘విజయ్ నేనూ ఇద్దరం నటులుగా పెరిగాము. ఆయన నాకు బాగా కావాల్సినవాడు. నా జీవితంలో తన పాత్ర చాలా ముఖ్యమైంది. నా జీవితంలో నేను ఏమి చేసినా అందులో విజయ్ కంట్రిబ్యూషన్‌ ఖచ్చితంగా ఉంటుంది. నేను చేసే ప్రతి పనిలో తన సలహా తీసుకుంటాను. అతని అభిప్రాయం నాకు ఎంతో అవసరం’ అని వివరించారు.

➡️