విజయవంతంగా పల్స్‌ పోలియో

Mar 3,2024 23:21
విజయవంతంగా పల్స్‌ పోలియో

ప్రజాశక్తి-యంత్రాంగం జిల్లావ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. 0-5 సంవత్సరాల పిల్లలను గుర్తించి పోలియో డ్రాప్స్‌ వేశారు. రాజమహేంద్రవరం రూరల్‌ బొమ్మూరు పిహెచ్‌సిలో మంత్రి వేణుగోపాల కృష్ణ, స్థానిక నాయకులు అధికారులతో కలిసి పల్స్‌ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ పోలియో నిర్మూలన దిశగా వైద్య రంగంలో వ్యాక్సిన్‌ ఆవిష్కరణ ద్వారా కొత్త శకానికి నాంది పలికినట్టు చెప్పారు. తొలుత కోటిపల్లి బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన పల్స్‌ పోలియో సెంటర్లో మంత్రి వేణు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి ఎఎన్‌.జ్యోతి, జెసిఎస్‌ కన్వీనర్‌ రాజమౌళి, అధికారులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.రాజమహేంద్రవరం చైల్డ్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరం కన్వీనర్‌ డాక్టర్‌ రమేష్‌ చున్నీలాల్‌ మున్సిపల్‌ హైస్కూల్‌, తుమ్మలోవలో పిల్లలకు పోలియో డ్రాప్స్‌ వేశారు. ఫోరం సభ్యులు కూటికుప్పల రమణ, అరుణ జ్యోతి, దాసరి నగేష్‌ పాల్గొన్నారునల్లజర్ల హోమ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ తానేటి వనిత నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద పోలియో కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఐదేళ్ల లోపు వయసు గల పిల్లలందరూ పల్స్‌ పోలియో చుక్కలను తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.తాళ్లపూడి పోలియో రహిత సమాజ స్థాపన కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ సహకరించాలని గోపాలపురం ఎంఎల్‌ఎ, వైసిపి కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి తలారి వెంకట్రావు అన్నారు. మండలంలోని పెద్దేవం సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన పోలియో చుక్కల పంపిణీ కేంద్రం వద్ద చిన్నారులకు తలారి పోలియో చుక్కలు వేశారు. డాక్టర్‌ అన్నపూర్ణ, సర్పంచ్‌ తిగిరిపల్లి వెంకట్రావు, ఎంపిపి జొన్నకూటి పోసిరాజు, ఉప సర్పంచ్‌ తోట రామకృష్ణ, వైసిపి మండల అధ్యక్షుడు కాకర్ల వెంకటేశ్వరరావు, వేగేశ్వరపురం సర్పంచ్‌ కొమ్మిరెడ్డి పరశురామారావు పాల్గొన్నారు.దేవరపల్లి పిహెచ్‌సిలో ఎంపిపి కెవికె.దుర్గారావు, ఎఎంసి చైర్మన్‌ గన్నమని జనార్థనరావు పోలియో చుక్కలు వేశారు. వైసిపి మండల అధ్యక్షుడు కూచిపుడి సతీష్‌, సర్పంచ్‌ కడిమి కుమారి, వైసిపి నాయకులు పి.రామ్‌ గోపాల్‌, దుగ్గిన ప్రసాద్‌, కడిమి రాజు, కామిశెట్టి దుర్గారావు, వెలగా శ్రీను పాల్గొన్నారు.గోకవరం మండలంలోని 14 గ్రామ పంచాయితీలు, పాఠశాలలో పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహించారు. రంపయర్రంపాలెం, వెదురుపాక గ్రామాల్లో వైసిపి మండల కన్వీనర్‌ పాటి రాంబాబు పోలియో చుక్కలు వేశారు. కడియం మండలంలో మొదటి రోజు 97.58 శాతం పోలియో చుక్కలు వేసినట్లు వైద్యాధికారులు డాక్టర ఎన్‌.జెస్సీ సుప్రియ, డాక్టర్‌ ఎం.మణిజ్యోత్స్న, డాక్టర్‌ జి.స్వరూప, డాక్టర్‌ ఎన్‌.నాగ సాయిమౌర్య తెలిపారు. పెరవలి పిహెచ్‌సి పరిధిలోని గ్రామాల్లో 4507 మంది పిల్లలకు డ్రాప్స్‌ వేసినట్లు వైద్యులు డాక్టర్‌ ఎహెచ్‌.విజరుకుమార్‌, ఎ.సత్యకృష్ణవేణి తెలిపారు. చాగల్లు మండలంలో 98.58 శాతం మందికి మొదటి రోజు పోలియో చుక్కలు వేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. సీతానగరం మండలంలో 96 శాతం మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్టు పిహెచ్‌సి వైద్యులు డాక్టర్‌ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ యేసు రాణి, డాక్టర్‌ మేఘన, వైద్యాధికారులు డాక్టర్‌ చైతన్య, డాక్టర్‌ రాజు పాల్గొన్నారు. ఉండ్రాజవరం పాలంగి సచివాలయంలో ఎంపిపి పాలాటి యల్లారీశ్వరి పోలియో చుక్కల మందు పంపిణీ ప్రారంభించారు. దమ్మెన్ను, మోర్త, ఉండ్రాజవరం, పాలంగిలో ఏర్పాట్లను పర్యవేక్షించారు.

➡️