విజయం

Jan 20,2024 10:25 #jeevana, #Success

హాప్‌ ఇయర్లీ పరీక్షల్లో దినేష్‌కి అన్ని సబ్జెక్టుల్లోనూ తక్కువ మార్కులు వచ్చాయి. తనతోపాటు ఉండే సంతోష్‌కి మంచి మార్కులు వచ్చాయి. ఆ రహస్యమేమిటో తెలుసుకోవాలని సంతోష్‌ దగ్గరకి వెళ్లాడు.”సంతోష్‌, నేను కష్టపడి చదువుతా. కానీ పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తున్నాయి. ఎందుకో అర్థం కావడం లేదు. నువ్వెలా మంచి మార్కులు సాధిస్తున్నావు? నాకు కూడా ఆ రహస్యం చెప్పవా?” అని అడిగాడు.దానికి సంతోష్‌ ”నువ్వు ఒక తప్పు చేస్తున్నావు. ఏరోజు పాఠం ప్రశ్నలు ఆ రోజు చదవటం లేదు. సెల్‌ చూసుకుంటూ కాలం గడిపేస్తున్నావు. దీంతో చదవకుండా మిగిలిపోయిన పాఠాలు చాలా ఉండిపోతున్నాయి. పరీక్షలు వచ్చేసరికి చదవాల్సిన ప్రశ్నలు ఎక్కువై ఇబ్బంది పడుతున్నావు. అదే నీ లోపం” అని వివరించాడు.”ఈసారైనా అన్నీ చదువు. ముఖ్యంగా ఏ రోజు పాఠం ఆ రోజు చదువు. సెల్‌ ఫోన్‌ దూరం పెట్టు. అప్పుడే అన్నిటిలో మంచి మార్కులు వస్తాయి” అని చెప్పాడు. ఆ రోజు నుంచి దినేష్‌ సెల్‌ ఫోన్‌ దూరం పెట్టాడు. ఏకాగ్రతతో చదవటం ప్రారంభించాడు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించాడు.   – కనుమ ఎల్లారెడ్డి, 93915 23027

➡️