వాలంటీర్లు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి : మంత్రి వేణు

ప్రజాశక్తి- కడియం: దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సచివాలయ వ్యవస్థను, అనుబంధంగా వాలంటీర్‌ సేవా వ్యవస్థను ప్రవేశపెట్టిహొదేశానికే ఆదర్శంగా నిలిచారని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాజమహేంద్రవరం రూరల్‌ వైసీపీ కో ఆర్డినేటర్‌ చెల్లుబోయిన శ్రీనివాస్‌ వేణుగోపాల కఅష్ణ అన్నారు. కడియం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన వాలంటరీలకు వందనం కార్యక్రమానికి మంత్రి వేణుగోపాల కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వాలంటీర్లకు సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర,హొ పురస్కార అవార్డులను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి అందజేశారు. అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా సేవా వజ్ర కింద సర్టిఫికెట్‌, శాలువ, బ్యాడ్జ్‌, మెడల్‌ తో పాటు 30 వేల రూపాయల నగదు, సేవా రత్న కింద సర్టిఫికెట్‌, శాలువ, బ్యాడ్జ్‌, మెడల్‌ తో పాటు 20 వేల రూపాయల నగదు, సేవా మిత్ర కింద సర్టిఫికెట్‌, శాలువ, బ్యాడ్జ్‌, మెడల్‌ తో పాటు 15 వేల రూపాయల నగదును అందించి సత్కరించారు. కడియం మండలంలో 482 మంది వాలంటీర్లకు ప్రోత్సాహాన్ని అందించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో జి రాజ్‌ మనోజ్‌, వైసీపీనాయకులు గిరజాల బాబు,హొయాదల సతీష్‌ చంద్ర స్టాలిన్‌, రాష్ట్ర దేవాంగ దొంతంశెట్టి చిన వీరభద్రయ్య, తడాల చక్రవర్తి, ఈలి గోపాలరావు, టేకి శ్రీనివాస్‌, దాసరి శేషగిరి, లావేటి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️