వడదెబ్బ నివారణపై అవగాహన

ప్రజాశక్తి- ఒంగోలు : ప్రభుత్వ వైద్యకళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం విద్యార్థులు వడ దెబ్బ నివారణపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. మంగమూరు డొంక పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద నుంచి శివప్రసాదర్‌ కాలనీ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా ప్రబుత్వ ఆర్యోగ శాఖ దీర్ఘకాలిక ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ భగీరద, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ బి. తిరుమలరావు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు విద్యార్థులు ఇంటింటికీ వెళ్లి వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సి జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ తిరుమల రావు మాట్లాడుతూ 40 డిగ్రీల కంటే ఎక్కువ ఎండ తీవ్రతకు లోనైతే వడదెబ్బ తగిలే అవకాశం ఉందన్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు వడదెబ్బకు గురికాకుండా ఉంటేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ హిమబిందు, డాక్టర్‌ సత్యశ్రీ, డాక్టర్‌ ప్రేమ, వెంకటేశ్వరుల, రవికుమార్‌, హౌస్‌ సర్జన్లు డాక్టర్‌ అభిజిత్‌, డాక్టర్‌ తేజ, డాక్టర్‌ వినోద్‌, డాక్టర్‌ అనిల్‌, ఆషా వర్కర్లుపాల్గొన్నారు.

➡️