లబ్ధిదారుల జాబితా కలెక్టర్‌కు అందజేత

Dec 14,2023 23:09
వేలు పరిహారం

ప్రజాశక్తి – యానాం

సముద్రంలో ఒఎన్‌జిసి వేస్తున్న రెండో గ్యాస్‌ పైపులైన్‌ వల్ల నియో జకవర్గంలో ఉపాధి కోల్పో యిన లబ్ధిదారుల జాబి తాను పుదుచ్ఛేరి కలెక్టర్‌కు నివేదించినట్లు ఎంఎల్‌ఎ గొల్లపల్లి శ్రీనివాస్‌ అశోక్‌ తెలిపారు. స్థానికంగా బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాబితా-ఎ, బిలు కలిపి 5,462 మందికి రూ.132 కోట్ల 36 లక్షల 75 వేల 880 లబ్ధిదారులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. నష్ట పరిహారం అందుకునే లబ్ధిదారుల సంఖ్య 4,570 మందిగా గుర్తించారని, వీరిలో పురుషులు 4,067 మంది, 503 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. వీరికి నెలకు రూ.11,500 చొప్పున వారి బ్యాంక ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు. నష్టపరిహారానికి సిఫార్స్‌ చేసిన బి జాబితాలో 892 మందిని చేర్చినట్లు తెలిపారు. చిన్న వయసు కల్గిన 66 మందికి రూ. కోటి 24 లక్షల 94 వేల 20లు, విద్యార్థులు కాని వారు 182 మందికి రూ.4 కోట్ల 38 లక్షల 43వేల 60లు, ప్రాజెక్టు అమలు చేసే సమయంలో సొసైటీలు, అండర్‌ టేకింగ్‌లు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా ఉన్న 21 మందికి రూ.35 లక్షల 9 వేల 800లు, ఒంటరి మహిళలకు, పరస్పరం విడిగా ఉంటున్న మహిళలు 24 మందికి రూ. 60 లక్షల 72 వేలు, డూప్లికేషన్‌ కేసులు 115 మందికి రూ.2 కోట్ల 90 లక్షల 95 వేలు, లేబర్‌ ఆఫీసులో నమోదు చేసుకున్న 173 మందికి రూ.4 కోట్ల 37 లక్షల 69 వేలు, ఫిషింగ్‌ కాకుండా ఇతర వృత్తులు చేసే 311 మందికి రూ.7 కోట్ల 86 లక్షల 83 వేలు పరిహారం అందించడం జరుగుతుందని తెలిపారు.

➡️