ర్యాలీ నిర్వహిస్తున్న అధికారులు

Dec 14,2023 19:27
ర్యాలీ నిర్వహిస్తున్న అధికారులు

ర్యాలీ నిర్వహిస్తున్న అధికారులు
ఇంధనం పొదుపు ప్రగతికి మలుపు
ప్రజాశక్తి-కోవూరు :ప్రజలు ఇంధనం వాడకంలో పొదుపు చేయడం ద్వారా రాష్ట్ర దేశ ఆర్థికాభివద్ధికి దోహదవడుతుందని ట్రాన్కో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు విజయకుమార్‌రెడ్డి అన్నారు. కోవూరులోని ట్రాన్స్కో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు కార్యాలయ ప్రాంగణంలో గురువారం జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు మానవజాతి మనుగడకు ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రధానంగా తక్కువ విద్యుతును వినియోగించే బల్బులు, ఫ్యాన్లు, ఏసీలు వాడుకోవాలని, తద్వారా విద్యుత్‌ ఆదా అవుతుందన్నారు. ముఖ్యంగా ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవడం వలన ప్రజలకు డబ్బుకూడా ఆదా అవుతుందన్నారు. ప్రధానంగా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఇంధన పొదుపుపై అవగాహన కల్పిస్తే ఆనంతరం భవిష్యత్తులో వారికి అది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వ్యవసాయ రంగంలో సైతం నాసిరకం మోటార్లు వాడకుండా ఐఎస్‌ఐఐ మార్కు కలిగిన మోటార్లు వాడడం వలన పెద్ద ఎత్తున విద్యుత్‌ ఆదా అయ్యేందుకు దోహదపడుతుందన్నారు. దీంతో పాటు ఇంట్లో వాడుకునే గీజర్లు, సోలార్‌ ద్వారా వచ్చే గీజర్లు వాడుకుంటే విద్యుతును పొదుపు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. విద్యుత్‌ వినియోగదారులు విద్యుత్‌ను ఆదా చేస్తే అది సంస్థకు, ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా దేశీయంగా ఇంధన వినియోగం అధికమవుతుందని మానవుని నిత్య జీవితంలో ఇంధనం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రకతి ద్వారా మనకు లభించే సహజ ఇంధన వనరులను వినియోగించుకోవడం వలన వాతావరణ కాలుష్యం కూడా తగ్గేందుకు అవరాజ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత పురవీధుల్లో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు పరిధిలోని కోవూరు, రాజుపాలెం, బుచ్చి, ఇందుకూరుపేటకు సంబంధించిన విద్యుత్‌ అధికారులు, ఉద్యోగులు ఈ ర్యాలీలో ట్రాన్స్‌కో డీఈలు సతీష్‌బాబు, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

➡️