రోడ్డు ప్రమాదంతో..పిడిఎస్‌ రైస్‌ రవాణా వెలుగులోకి

Mar 8,2024 22:21
రోడ్డు ప్రమాదంతో..పిడిఎస్‌ రైస్‌ రవాణా వెలుగులోకి

ప్రజాశక్తి గండేపల్లిప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదల బియ్యం దొడ్డి దారిన తరలిస్తున్న నేరగాళ్ల వైనం బయట పడింది. గండేపల్లి మండలం నీలాద్రి రావు పేట గ్రామ శివారు వీరమ్మ పేరంటాల అమ్మవారి గుడి వద్ద పిడిఎస్‌ రైస్‌తో వెళ్తున్న వ్యాను ప్రమాదానికి గురి అయింది. విజయవాడ నుండి పిఠాపురం మండలం బి.ప్రత్తిపాడు వెళుతున్న వ్యాన్‌లో మూడు టన్నుల పిడిఎస్‌ రైస్‌ అక్రమంగా తరలిస్తున్న విషయం వెలుగు చూసింది. వ్యాను జాతీయ రహదారిపై వెళుతుండగా, అదుపుతప్పి డివైడర్‌ ఢ కొట్టి రోడ్డుకు అవతల వైపు వెళుతున్న వ్యాన్‌ను ఢకొీంది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న నలుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వైద్యం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డిఎస్‌ఒ ఎంవి.ప్రసాద్‌ మాట్లాడుతూ విజయవాడ నుంచి అక్రమంగా పిడిఎస్‌ రైస్‌ను పిఠాపురం మండలం భోగాపురం గ్రామానికి చెందిన వెలుగు వాసు అనే వ్యక్తి ఎటువంటి ఉత్తర్వులు లేకుండా విజయవాడలో సర్వో ఆగ్రో కంపెనీ నుంచి తరలిస్తున్నట్టు గుర్తించారు. రైస్‌ విలువ రూ.4.5 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ పిడిఎస్‌ రైస్‌ను మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకుని, జగ్గంపేట మండలం మర్రిపాకలోని స్టాక్‌ పాయింట్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్‌ సిఐ నాగరాజు, ఎంఎస్‌ఒ కృష్ణ, విఆర్‌ఒ దుర్గ పోలీస్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

➡️