రైతుభరోసా కేంద్రాలతో ప్రయోజనం

ప్రజాశక్తి-శింగరాయకొండ : సచివాలయాలకు అనుబంధంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లీనిక్‌ సెంటర్లు రైతులు, ప్రజలకు అండగా ఉంటాయని రాష్ట్ర మున్సిపల్‌ పట్టణాభివద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. శింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామ పంచాయతీలో నూతన నిర్మించిన రైతు భరోసా కేంద్రం, హెల్త్‌ క్లినిక్‌ సెంటర్‌ భవనాలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయంపై ఆధారపడిన గ్రామంగా సోమరాజుపల్లి ఉందన్నారు. ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. హెల్త్‌ క్లీనిక్‌ సెంటర్‌లో అన్ని రకాల వైద్య సేవలు అందుతాయన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు ఉపయోగ పడుతున్నట్లు తెలిపారు. గ్రామంలో అందరూ కలిసికట్టుగా పని చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి యన్నాబత్తిన సరోజ, వైస్‌ఎంపిపి సామంతుల రవికుమార్‌రెడ్డి, వైసిపి నాయకులు యన్నాబత్తిన వెంకటేశ్వరరావు, డాక్టర్‌ యన్నాబత్తిన కార్తీక్‌, వేల్పుల మాలకొండయ్య, వేల్పుల పెదబాబు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొండపి : గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల శ్రేయస్సు కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పురపాలక మంత్రి, వైసిపి కొండపి నియోజవకర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. మండల పరిధిలోని క.ఉప్పలపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రం, హెల్‌క్లీనిక్‌ భవనాలను శనివారం ప్రారంభించారు. తొలుత గ్రామంలోని వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కూలీలతో మంత్రి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్త్రీశిశు సంక్షేమ సంఘం చైర్మన్‌, జడ్‌పిటిసి మారెడ్డి అరుణ వెంకటాద్రిరెడ్డి, వైసిపి రాష్ట్ర నాయకుడు డాకా పిచ్చిరెడ్డి, వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మద్దిపాడు : మండల పరిధిలోని తెల్లబాడు, దొడ్డవరం గ్రామంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మేరుగ నాగార్జున పలు అభివద్ధి పనులను ప్రారంభించారు. తొలుత వైఎస్‌ఆర్‌, అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించి రైతు భరోసా కేంద్రం, సిసి రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపిపిటిసి ఉన్నం ప్రసీద మంత్రి నాగార్జునను శాలువాతో సత్కరించారు. అనంతరం నందిపాడు గ్రామంలో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయా కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షుడు మండవ అప్పారావు, ఎంపిపి వాకా అరుణ కోటిరెడ్డి, జడ్‌పిటిసి తేళ్ల పుల్లారావు, జెసిఎస్‌ ఇన్‌ఛార్జి బత్తుల శ్రీనివాసరావు, కొత్త సుమన్‌, ఎపిటిసి మేరిగ పద్మ, మేరిగా చిన్న వెంకటేశ్వర్లు, నందిపాడు సర్పంచి అరుణ శ్రీకాంత్‌ , నందిపాడు సొసైటీ చైర్మన్‌ అప్పయ్య, వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కనిగిరి : సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటివద్దకే ప్రభుత్వ సేవలు అందుతున్నట్లు వైసిపి కనిగిరి నియోజక వర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ దద్దాల నారాయణ యాదవ్‌ తెలిపారు. మండల పరిధిలోని తుమ్మకుంట గ్రామపంచాయతీ నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దద్దాల మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నెరవేర్చిన ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి ఎన్నికల పరిశీలకులు చింతలచెరువు సత్యనారాయణ రెడ్డి, ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసిల సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, కనిగిరి మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌ ,కనిగిరి జడ్‌పిటిసి మడతల కస్తూరి రెడ్డి , ఎంపిపి దంతులూరి ప్రకాశం , సర్పంచి ఇండ్ల రత్తమ్మ ఓబులేసు, వైసిపి నాయకులు వెంకట్రావు, శివరామయ్య ,సుధాకర్‌ ,ఇశ్రాయేలు ,శ్రీను బాల నరసయ్య ,రామయ్య, బాలంకయ్య ,పెద్ద పుల్లయ్య,చిన్న పుల్లయ్య, బాలయ్య, లక్ష్మయ్య, శ్రీను, కష్ణయ్య, లక్ష్మయ్య , ఓబయ్య, ఓబులేసు, నాగయ్య ,రామయ్య తదితరులు పాల్గొన్నారు. కొమరోలు : మండల పరిధిలోని బ్రాహ్మణ పల్లెలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయం, హెల్త్‌ సెంటర్‌, రైతు భరోసా కేంద్రం భవనాలను ఎంపిపి కావూరి అమూల్య శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ గ్రామ స్వరాజ్య స్థాపన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డితోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️