రైతు అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

Feb 14,2024 21:09

ప్రజాశక్తి- గంట్యాడ: రైతు అభివృద్ధే ప్రభుత్య ధ్యేయంగా ఆర్‌బికెలను నిర్మించిందని ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అన్నారు. మండలంలోని వసంత గ్రామంలో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల కాలంలో రైతులకు అనేక పథకాలను అందజేశామన్నారు. విత్తనాలను ఇతర పనిముట్లను రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ప్రభుత్వం అందిస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాలను రైతు భరోసా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసి ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందన్నారు. నియోజకవర్గ పరిధిలో 85శాతం కేంద్రాలు నిర్మించామని మిగిలినవి వివిధ దశలో ఉన్నాయని త్వరలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పీరుబండి హైమావతి, జెడ్‌పిటిసి వరి నరసింహమూర్తి, గ్రామ సర్పంచ్‌ సిరికి అచ్చియమ్మ, ఎఒ బి.శ్యామ్‌ కుమార్‌, ఎస్‌సి సెల్‌ జిల్లా అధ్యక్షులు పి జైహింద్‌ కుమార్‌, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️