రెండో టి20లోనూ న్యూజిలాండ్‌ గెలుపు

Jan 14,2024 22:05 #Sports

పాకిస్తాన్‌తో సిరీస్‌

హామిల్టన్‌: పాకిస్తాన్‌తో జరిగిన రెండో టి20లోనూ ఆతిథ్య న్యూజిలాండ్‌ జట్టు ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 194పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. ఓపెనర్‌ అలెన్‌(74; 41బంతుల్లో 7ఫోర్లు, 5సిక్సర్లు), సాంట్నర్‌(25; 13బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) బ్యాటింగ్‌లో రాణించారు. పాకిస్తాన్‌ బౌలర్లు రవూఫ్‌కు మూడు, అబ్బాస్‌ అఫ్రిదికి రెండు, జమాల్‌, ఉస్మా మీర్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఛేదనలో పాకిస్తాన్‌ ఓపెనర్లు ఆయుబ్‌(1), రిజ్వాన్‌(7) విఫలమైనా.. బాబర్‌(6; 43బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్సర్లు), ఫకర్‌ జమాల్‌(50; 25బంతుల్లో 3ఫోర్లు, 5సిక్సర్లు), షాహిన్‌ అఫ్రిది(22) బ్యాటింగ్‌లో రాణించారు. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు నిరాశపరచడంతో 19.3ఓవర్లలో 173పరుగులకు ఆలౌటైంది. ఆదమ్‌ మిల్నేకు నాలుగు, టిమ్‌ సోథీ, బెన్‌ సీర్స్‌, ఇష్‌ సోథీకి రెండేసి వికెట్లు దక్కాయి. దీంతో మూడు టి20ల సిరీస్‌లో న్యూజిలాండ్‌ 2-0 ఆధిక్యతలో ఉండగా.. మూడో టి20 బుధవారం జరగనుంది.

➡️