రాజధాని అమరావతిలో సచివాలయ ఉద్యోగులకు స్థలాలు

అమరావతి: రాజధాని అమరావతి విధ్వంసానికి కంకణం కట్టుకున్న జగన్‌ ప్రభుత్వానికి.. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల స్థలాలు మాత్రం కావలసి వచ్చింది. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు రాజధానిలో స్థలాలు కేటాయిస్తూ ఎన్నికల షెడ్యూల్‌ వెలవడటానికి కొన్ని గంటల ముందు శనివారం జీవో జారీ చేసింది. అమరావతిలోని పిచ్చుకలపాలెం గ్రామ పరిధిలో ఉద్యోగులకు స్థలాలు కేటాయిస్తున్నట్లుగా పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి.. జీవోలో పేర్కొన్నారు. ఉద్యోగులకు ఇచ్చే స్థలాల విస్తీర్ణం, ధర.. 2019లో ప్రభుత్వ ఉద్యోగులకు రాజధానిలో స్థలాలు కేటాయిస్తూ ఇచ్చిన జీవోల్లోని నిబంధనల ప్రకారమే ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు స్థలాలు ఇవ్వడాన్ని ఎవరూ తప్పుబట్టరు.. కానీ అయిదేళ్లలో రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా వేయని జగన్‌ ప్రభుత్వం.. కొన్ని గంటల్లో షెడ్యూల్‌ వస్తుందనగా సచివాలయ ఉద్యోగులకు స్థలాలు కేటాయిస్తూ జీవో జారీ చేయడం చర్చనీయాంశమైంది.

➡️