రక్తదాన శిబిరం

Jan 16,2024 21:05
ఫొటో : రక్తదానం చేస్తున్న గ్రామాల యువత

ఫొటో : రక్తదానం చేస్తున్న గ్రామాల యువత
రక్తదాన శిబిరం
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని తిక్కవరంలో సంక్రాంతి సందర్భంగా ఇనకుర్తి.నాగార్జున జ్ఞాపకార్థం ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ నెల్లూరు వారి సహకారంతో ఇనకుర్తి.నాగార్జున మిత్రమండలి ఆధ్వర్యంలో ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం రక్తదాన శిబిరాన్ని మాజీ కన్వీనర్‌ గంగవరపు శ్రీనువాసులు నాయుడు మండల వైద్యాధికారి డాక్టర్‌ గోపినాథ్‌ రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనువాసులు నాయుడు మాట్లాడుతూ పది సంవత్సరాల నుండి స్నేహితుడు కోసం రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. చుట్టుపక్కల గ్రామాల యువత తిక్కవరం గ్రామ యువతను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మెట్టప్రాంత గ్రామాలలో రక్తదాన క్యాంపులు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. వైద్యాధికారి డాక్టర్‌ గోపినాథ్‌ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డెంగ్యూ, చికున్‌గున్యా, టైఫాయిడ్‌ జ్వరాలు ఎక్కువగా వస్తుంటాయని, రక్త కణాలు తగ్గినప్పుడు రక్తం కావాల్సి వస్తుందని, ఇలాంటి రక్తదాన క్యాంపులు పెట్టడం ద్వారా మనకు రక్తం సులభంగా అందుతుందన్నారు. మారుమూల ప్రాంతాలలో యువతలో రక్తం ఇచ్చేంత చైతన్యం రావడం అభినందనీయమన్నారు. ఈ శిబిరంలో 53మంది రక్తదానం చేశారన్నారు. కార్యక్రమంలో వైసిపి సేవాదళ్‌ జిల్లా జాయింట్‌ సెక్రెటరీ నారాయణస్వామి, గోవర్ధన్‌, జనకుర్తి నాగార్జున, మిత్రమండలి సభ్యులు గంగినేని విజరు కుమార్‌, బోయపాటి నాగేశ్వరరావు, బత్తిన సుధాకర్‌, గంగినేని నరేష్‌, తాటికొండ వినోద్‌, రాటకొండ భవదీప్‌, పవన్‌, సింహాద్రి, భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️