మెదడు శస్త్రచికిత్సలో న్యూరో సర్జరీ పాత్ర చాలా కీలకం

మెదడు శస్త్రచికిత్సలో న్యూరో సర్జరీ పాత్ర చాలా కీలకం

మెదడు శస్త్రచికిత్సలో న్యూరో సర్జరీ పాత్ర చాలా కీలకంస్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌వి కుమార్‌ వెల్లడిప్రజాశక్తి- తిరుపతి సిటీ: మెదడు శస్త్ర చికిత్సలో న్యూరో సర్జరీ పాత్ర చాలా కీలకమని స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌వి.కుమార్‌ తెలిపారు. స్విమ్స్‌ న్యూరోసర్జరీ విభాగం ఆధ్వర్యంలో చెరుకూరి నరసింహా, సుభద్రాదేవి 9వ వార్షిక చైర్‌ఒరేషన్‌ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌వి.కుమార్‌, ముఖ్యఅతిదిగా ఆస్ట్రేలియాకు చెందిన రాయల్‌ హౌబర్ట్‌ హాస్పిటల్‌, హౌబర్ట్‌, టాస్మానియా, డాక్టర్‌ అరవింద్‌ కుమార్‌ దూబే, శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ ఉషాకళావత్‌, న్యూరోసర్జరీ సీనియర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బిసిఎం. ప్రసాద్‌, న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ వివి.రమేష్‌ చంద్ర, సంయుక్తంగా జ్యోతిని వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్విమ్స్‌ డైరెక్టర్‌ మాట్లాడుతూ, న్యూరోసర్జరీ విభాగంలో పేరు ప్రఖ్యాతులు గాంచి న్యూరోసర్జరీ విభాగానికి అందించిన సేవలను పరిగణలోనికి తీసుకుని డాక్టర్‌ అరవింద్‌ కుమార్‌ దూబేని ఈ కార్యక్రమానికి ఒరేటర్‌ ఆహ్వానించడం జరిగిందని, వైద్యవిద్యార్థులు, ఇటువంటి వైద్య విద్యా కార్యక్రమాలకు హాజరవ్వడం ద్వారా తమ వైద్య పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి డాక్టర్‌ అరవింద్‌ కుమార్‌ దూబేవై అనేరీజం క్లిప్పింగ్స్‌ షౌల్ద్‌ కంటిన్యూ అనే అంశంపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వైద్యవిద్యార్ధులకు వివరించారు. కార్యాక్రమంలో డాక్టర్‌. శివకుమార్‌, డాక్టర్‌. వెంకట్‌, డాక్టర్‌ ప్రవీణ్‌, డాక్టర్‌ సరళ, న్యూరో సర్జరీ వైద్యలు, రేడియాలజీ వైద్యలు, వైద్యవిద్యార్థులు స్విమ్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️