ముగ్గురు అఫ్ఘన్‌ ఆటగాళ్లకు ఎన్‌ఓసి నిరాకరణ

Dec 26,2023 22:20 #Sports

2024 ఐపిఎల్‌ సీజన్‌కు దూరం?

కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు ఆ దేశ క్రికెట్‌ బోర్డు ‘నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌'(ఎన్‌ఓసి) ఇచ్చేందుకు విముఖత చూపింది. పేసర్లు నవీనుల్‌ హక్‌, ఫజల్‌ హక్‌తోపాటు స్పిన్నర్‌ ముజీబ్‌ రెహ్మాన్‌కు వచ్చే రెండేళ్లపాటు ఎన్‌ఓసి ఇవ్వకూడదని ఆఫ్ఘన్‌ క్రికెట్‌ బోర్డు నిర్ణయించినట్లు సమాచారం. వీరు జాతీయ జట్టు కంటే లీగ్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నారనే కారణంతోనే సెంట్రల్‌ కాంట్రాక్ట్‌నూ పొడిగించలేదు. దీనిపై అంతర్గత కమిటీని నియమిస్తూ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కమిటీ తీసుకునే నిర్ణయం ఆధారంగానే బోర్డు తుది ఆదేశాలు ఉంటాయి. ఒకవేళ ముగ్గురు ఆటగాళ్లకు ఎన్‌వోసీ ఇవ్వకపోతే వచ్చే ఐపీఎల్‌లో ఆడటం అనుమానమే. ఐపిఎల్‌ వేలంలో ముజీబ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ఫజల్‌హక్‌ను సన్‌రైజర్స్‌, నవీనుల్‌ను లక్నో సూపర్‌ జెయింట్స్‌ రిటైన్‌ చేసుకున్నాయి.

 

➡️