మానవత్వం ఉన్న పోలీసు

Feb 1,2024 20:29

ప్రజాశక్తి – బొండపల్లి : గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన గెద్ద మణికంఠ చదువులో భాగా రాణించేవాడు. తండ్రిని కోల్పోయిన మణికంఠ తల్లి నారాయణమ్మ సహకారంతో చదువుకోవాలని ఆశ ఉన్నప్పటికి పేదరికం అడ్డురావడంతో ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాడు. ఈ పరిస్థితిని గమనించిన బొండపల్లి ఎఎస్‌ఐగా పనిచేస్తున్న అదే గ్రామానిక చెందిన లెంక గోపీనాధ రావు చదివించేందుకు ముందుకు వచ్చారు. విద్యకు అవసరమైన చేయూతను అందిస్తానని తల్లి నారాయణమ్మకు విద్యార్ధి మణికంఠకు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఎఎస్‌ఐ గోపీనాధరావు గొట్లాం గాయత్రి కళాశాలలో మణికంఠను ఇంటర్‌లో చేర్పించారు. ఇందుకు సంబందించి హాస్టల్‌ వసతికి, కళాశాల ఫీజుకు అయిన ఖర్చును భరించారు. ఈ మేరకు గురువారం కళాశాల యాజమాన్యానికి మొత్తం ఫీజును చెల్లించారు. దీంతో విద్యార్ధి మణికంఠ సంతోషం వ్యక్తం చేశారు. కాగా పోలీస్‌ అంటే కర్కసత్వం, కాటిన్యం అనుకొనే వారికి చదువు కోసం గోపీనాద్‌ చూపిన మానవత్వం పలువురుకి ఆదర్శంగా నిలుస్తుందని పలువురు కొనియాడుతున్నారు.

➡️