మహిళల అభివద్ధికి పెద్దపీట : కలెక్టర్‌

ప్రజాశక్తి – రాయచోటి మహిళల అభివద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కలెక్టర్‌ గిరీష పిఎస్‌ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో ఉన్నతి – మహిళాశక్తి పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు మంజూరైన ఆటో రిక్షాలను కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతి మహిళాశక్తి పథకం కింద ఎస్‌సి, ఎస్‌టి నిరుపేద మహిళలకు 2023- 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ లేని రుణాల ద్వారా అన్నమయ్య జిల్లాలో 11 మంది మహిళలకు ఆటోలు అందజేశామని చెప్పారు. .ఇందులో ఒక్కొక్క లబ్ధిదారు 10 శాతం వాటా చెల్లించాల్సి ఉంటుందన్నారు. మిగిలిన 90 శాతం వడ్డీ లేని రుణం ద్వారా 48 కంతులలో తిరిగి డబ్బు చెల్లించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివద్ధికి అనేక పథకాలు ప్రవేశపెడుతుందని అర్హులందరూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివద్ధి చెందాలని ఆకాక్షించారు. పథకం కింద అందించిన ఆటోలను లబ్ధిదారులు అమ్ముకోకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మహిళా లబ్ధిదారులకు కలెక్టర్‌ చేతుల మీదుగా ఆటోలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ సత్యనారాయణ, కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లు, ఏరియా కో-ఆర్డినేటర్లు లబ్ధిదారులు పాల్గొన్నారు.

➡️