మహాత్మాగాంధీకి ఘన నివాళి

ప్రజాశక్తి-పంగులూరు: జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా మంగళవారం పంగులూరులోని రోటరీ భవనం దగ్గర జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి రోటరీ క్లబ్‌ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీ చూపిన శాంతి, అహింసామార్గంలో పయనిస్తామని ఈ సందర్భంగా విగ్రహం ముందు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ చైర్మన్‌ చిలుకూరి వీరరాఘవయ్య మాట్లాడుతూ, గాంధీ చూపిన మార్గంలో ప్రజలంతా నడవాలని, శాంతి సమాధానాలు కలిగి తోటి వారికి సాయపడే విధంగా పనిచేయాలని అన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల్లో మహాత్మాగాంధీ సూచించిన శాంతి సందేశం దేశానికి ఎంతో అవసరం అని అన్నారు. రోటరీ క్లబ్‌ ట్రెజరర్‌ గుర్రం ఆంజనేయులు మాట్లాడుతూ దేశంలో అవినీతి, అశాంతి ఎక్కువయ్యాయని, దేశాన్ని మంచిమార్గంలో నడిపేందుకు యువత ముందుకు రావాలని అన్నారు. అనంతరం గాంధీ విగ్రహం ముందు ప్రమాణం చేశారు. అంతకుముందు పంగులూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో రోటరీ క్లబ్‌ పంగులూరు సెక్రటరీ షేక్‌ కాలేషావలి, సభ్యులు జాగర్లమూడి సుబ్బారావు (జె.కే.సి), పోలిశెట్టి సీతారామయ్య, క్లబ్‌ మాజీ అధ్యక్షులు ఏనికపాటి శ్రీనివాస రావు, గుడిపూడి రామారావు, మూలవీసాల ఉమా మహేశ్వరరావు (ఉమ్మయ్య), ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. అద్దంకి: జాతిపిత మహాత్మాగాంధీజీ వర్థంతి సందర్భంగా అద్దంకి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్లో జాతిపితకు ఘనంగా మంగళవారం నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు కూరపాటి రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దేశ్‌పద్మేష్‌, స్థానిక వార్డు కౌన్సిలర్‌ కొణిజేటి విజయలక్ష్మి మాధవరావు, 12వ వార్డు ఇన్‌ఛార్జి వుడతు సురేష్‌, స్థానిక ఆర్యవైశ్య పెద్దలు కనమర్లపూడి శ్రీనివాసరావు, మామిడి వెంకటేశ్వర్లు, నల్లమల్లి సుబ్రహ్మణ్యం, మేడా వెంకటేశ్వర్లు, మిరియాల శ్రీనివాసరావు, అత్తలూరి శ్రీనివాసరావు, మిత్తింటి సాయినాథ్‌, చామర్తి కుమారు, స్థానిక కౌన్సిలర్లు జబ్బారు, గుంజి కోటేశ్వరరావు, వైకుంఠ రవితేజ, గోశాల దుర్గాప్రసన్న (బన్ను), స్థానిక ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. భట్టిప్రోలు: జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పలువురు నాయకులు ప్రజాప్రతినిధులు పూలమాలవేసిన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ డివి లలితకుమారి, జడ్పిటిసి టి ఉదరు భాస్కరి, మండల తహశీల్దారు దూలపూడి వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి ఏ శ్రీదేవి, పిఆర్‌ ఏఈ రామచంద్రరావు, నాయకులు మల్లేశ్వరరావు, బాలాజీ, మండల సమైక్య సిబ్బంది, కార్యాలయ సిబ్బంది ఉన్నారు. ముండ్లమూరు: గాడ్సేలను నిలేయడమే గాంధీకి నిజమైన నివాళి అని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వెల్లంపల్లి ఆంజనేయులు అన్నారు. మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా మంగళవారం ముండ్ల మూరులో ప్రజాసంఘాల నాయకులు మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు స్వాతంత్య్రోద్యమ సారథిగా గాంధీ పేరుగాంచారని అన్నారు. హిందూ-ముస్లిం ఐక్యత కోసం, అణగారిన తరగతుల అభ్యున్నతి కోసం పాటు పడ్డారని కొనియాడారు. గాంధీ మత సామరస్యం గురించి చెప్పిన మాటలూ ఆచరణా నచ్చని నాధూరాం గాడ్సే ఆయనను 1948 జనవరి 30వ తేదీన దారుణంగా కాల్చి చంపాడని అన్నారు. ప్రస్తుతం అనేకమంది గాడ్సేలు తయారయ్యారని, వీరిని నిలువరించడమే గాంధీకి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోడపాటి హనుమంతరావు, సత్యం, నన్నం రామాంజనేయులు, కూడలి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. పర్చూరు: మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా కొట్లబజారులోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సెక్రటరీ మామిడిపాక హరిప్రసాదరావు, తవ్వ భావన్నారాయణ, కాసా అజరు, పొత్తూరి వెంకటేశ్వరరావు, తెలనాకుల కమలాకరరావు, లింగేశ్వరరావు, రంగా పాల్గొన్నారు.

➡️