.మలేరియా కార్మికులను పర్మినెంట్‌ చేయాలి

.మలేరియా కార్మికుల

ప్రజాశక్తి -గాజువాక : జివిఎంసి మలేరియా విభాగంలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్‌ కార్మికులుగా గుర్తించి, వారికి ప్రభుత్వపరంగా ప్రయోజనాలను కల్పించాలని జివిఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌, గాజువాక జోన్‌ కమిటీ నాయకులు, గొలగాని అప్పారావు, ఎం. రాంబాబు, డిమాండ్‌ చేశారు. గురువారం గాజువాకలో నిర్వహించిన యూనియన్‌ జనరల్‌ బాడీ సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రభుత్వం సీజన్‌ వ్యాధులకు అనుకూలంగా కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ సేవకులుగా మలేరియా వర్కర్లుతో తాత్కాలికంగా పనిచేయించుకోవడం దుర్మార్గమన్నారు. మలేరియా కార్మికులను రెగ్యులర్‌ కార్మికులుగా గుర్తించడంతోపాటు, మధ్య దళారీల ప్రమేయాన్ని నివారించాలన్నారు. కాలనీలు, వాడల విస్తరణతో వీరికి పనిభారం పెరుగుతోందని, అదనపు కార్మికులను నియమించడం ద్వారా, ప్రయోజనాలను గానీ కల్పించడం లేదన్నారు. దోమల నివారణకు నాసిరకం కెమికల్స్‌ వాడడం వల్ల ప్రజాధనం దుర్వినియోగమే తప్ప ప్రయోజనం ఉండడం లేదన్నారు. కార్మికులకు సేఫ్టీ పరికరాలు సబ్బులు, మాస్కులు, గ్లౌజులు, రెయిన్‌ కోట్‌లు ఇవ్వాలన్నారు. రాష్ట్రవ్యాప్త సమ్మె సందర్భంగా కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలకు జిఒలు జారీచేసి అమలు చేయాలన్నారు. సమావేశంలో వై. చిన్నారావు, శ్రీను, శివంగి, భవాని పాల్గొన్నారు.

మాట్లాడుతున్న రాంబాబు

➡️