మతం పేర విభజించే బిజెపిని ఓడించాలి

Mar 23,2024 23:34
మతం పేర విభజించే బిజెపిని ఓడించాలి

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంబిజెపి అధికారాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలను మతం, కులం, జాతి, ప్రాంతం పేరుతో విభజించేందుకు కుట్రలు చేస్తోందని, ఆ కుట్రలను తిప్పి కొట్టి ఎన్నికల్లో బిజెపి, కూటమిని ఓడించి బుద్ధి చెప్పాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి.అరుణ్‌ పిలుపు ఇచ్చారు. భగత్‌ సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ చిన్న వయసులోనే బ్రిటిష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడి 93 సంవత్సరాల క్రితం తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించారని కొనియాడారు. ఆ వీరుల ఆశయాలైన అందరికీ సమాన అవకాశాలు, ప్రజాస్వామ్య హక్కులు, అభివద్ధి, స్వేచ్ఛ, ప్రజల విశాల ఐక్యతను కాపాడడం కోసం మనం ప్రతిజ్ఞ తీసుకోవాలని అన్నారు. రష్యా సోషలిస్ట్‌ ప్రభుత్వం నిర్మాత లెనిన్‌ జీవిత చరిత్రను భగత్‌ సింగ్‌ను ఉరి తీస్తున్న సమయంలో కూడా అధ్యయనం చేశాడన్నారు. సోషలిజం మాత్రమే అన్ని సమస్యలకు పరిష్కారం అని భగత్‌ సింగ్‌ భావించాడని, అటువంటి అసమానతలు లేని సమాజం కోసం యువత కృషి చేయాలని కోరారు. ముందుగా భగత్‌ సింగ్‌ విగ్రహానికి నాయకులు టి అరుణ్‌, కె.రామకష్ణ, బి.రాజులోవ, బి.పవన్‌, పి తులసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కార్మిక, రైతు, ప్రజాసంఘాల నాయకులు పి.వెంకటేశ్వరరావు, పి.రామకష్ణ, ఉమా, సుబ్రహ్మణ్యం, తాతారావు రాంబాబు పాల్గొన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆర్ట్స్‌ కళాశాల పక్కన ఎస్‌టి బాలికల వససి గృహం, ఎస్‌సి బాలుర స్కూల్‌ హాస్టల్‌లో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై.భాస్కర్‌, ఎన్‌.రాజా భగత్‌ సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కె.జ్యోతిర్మయి, జిల్లా కమిటీ సభ్యులు దుర్గ, అచ్చారావు పాల్గొన్నారు.కడియం దేవి గుడి సెంటర్లో భగత్‌ సింగ్‌ సేవా సంస్థ అధ్యక్షుడు తమ్మిశెట్టి ప్రసాద్‌ ఆధ్వర్యాన భగత్‌ సింగ్‌ 93వ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ న్యాయవాది తోరాటి వసంతరావు మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల బలిదానం ఫలితంగా మనం స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుభవిస్తున్నామన్నారు. అనంతరం భగత్‌ సింగ్‌ అమర్‌ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మర్రి సుబ్రహ్మణ్యం, చిరుకూరి నాగేశ్వరరావు, నందం వీరబాబు, చల్లా అంజి, పళ్ల వెంకటగిరి, కళ్యాణపు సూరిబాబు పాల్గొన్నారు.రాజానగరంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో భగత్‌ సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు జె.సత్తిబాబు మాట్లాడారు. మరుకుర్తి వీరలక్ష్మి , తామెరల గౌరీ, నక్కా లక్ష్మి, గున్నూరు అరవాలమ్మ, తోటకూర బేబీ, మార్గాని సత్యవతి, అనంతలక్ష్మి, జగదాంబ, కృష్ణవేణి పాల్గొన్నారు.

➡️