‘మట్కా’ గ్లింప్స్‌

Jan 20,2024 07:53 #movie, #varun tej

వరుణ్‌తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘మట్కా’. శుక్రవారం వరుణ్‌ బర్త్‌డే (జనవరి 19) సందర్భంగా చిత్రయూనిట్‌ గ్లింప్స్‌ని రిలీజ్‌ చేసింది. ఇందులో వరుణ్‌తేజ్‌ ఫోన్‌లో మాట్లాడుతూ.. ఎవరికో ప్రామిస్‌ చేసినట్లు కనిపిస్తుంది. గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో వరుణ్‌ కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌కు జోడీగా బాలీవుడ్‌ నటి నోరా ఫతేహీ, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవీన్‌ చంద్ర, రవిశంకర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పలాస 1978 ఫేమ్‌ కరుణకుమార్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా.. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజేందర్‌ రెడ్డి తీగల, రజని తాళ్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

➡️