మంత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

మంత్రి అమర్‌నాథ్‌ను కలిసిన మలసాల ధనమ్మ, రమణరావు, భరత్‌

ప్రజాశక్తి-అనకాపల్లి

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడుకు మంగళవారం పలువురు అధికారులు, పార్టీ నాయకులు కలిసి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మిందిలోని మంత్రి అమర్నాథ్‌ క్యాంపు కార్యాలయానికి వైసిపి అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డెడ ప్రసాద్‌, కసింకోట మండల అధ్యక్షులు మలసాల కిషోర్‌, చోడవరం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఏరువాక సత్యరావు, అనకాపల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గొల్లవిల్లి శ్రీనివాసరావు, వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ చిక్కాల రామారావు, అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయ చైర్మన్‌ కొణతాల మురళి, కసింకోట జడ్పిటిసి శ్రీధర్‌ రాజు, పార్టీ అధికార ప్రతినిధి మళ్ళ బుల్లిబాబు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట రామయ్య, ఐలా కమిషనర్‌ జయచంద్ర, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ త్రినాథ్‌, వైసిపి గాజువాక నియోజకవర్గ ఇన్చార్జి ఉరుకుటి చందు, గంగుపాము నాగేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో వచ్చి పుష్పగుచ్ఛాలని అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కశింకోట : రాష్ట్ర మంత్రి అమరనాథ్‌ను ఎంపీపీ కలగ లక్ష్మీ గున్నయ్యనాయిడు, జెడ్పీటీసీ శ్రీధర్‌ రాజు, విశాఖ డెయిరీ డైరెక్టర్‌ మలసాల రమణరావు, మాజీ జెడ్పీటీసీ మలసాల ధనమ్మ, మలసాల భరత్‌ కుమార్‌ తదితరులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.డిప్యూటీ సిఎం బూడికి…చోడవరం : వైసిపి వైద్య విభాగం జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ బండారు సత్యనారాయణ మంగళవారం ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడును మంగళవారం తారువలోని ఆయన నివాసంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బండారు సత్యనారాయణ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పార్టీ నిర్ణయం మేరకు ఎవరికి టికెట్‌ కేటాయించిన పనిచేస్తామన్నారు. దేవరాపల్లి : ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు తారువలోని ఆయన క్యాంప్‌ కార్యాలయంలో అనకాపల్లి ఆర్‌డిఒ చిన్నికృష్ణ, మండల తహశీల్దారు ఎమ్‌.లక్ష్మి, వీఆర్వో సంఘం అధ్యక్షులు పోతల శంకరరావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నాలుగు మండల గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు, అనకాపల్లి డిఈ నాగేశ్వరరావు, అల్లు సూర్యనారాయణ, జెఈ, నాలుగు మండలాల ఏఈలు, సిహెచ్‌వి సింహరావు, శ్వేత, శ్రీకాంత్‌, చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు.

➡️