మండల అభివద్ధికి సహకరించండి: ఎంపీపీ

Jan 30,2024 22:13
మండల అభివద్ధికి సహకరించండి: ఎంపీపీ

ప్రజాశక్తి-కార్వేటినగరం: మండల అభివద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కషి చేయాలని ఎంపీపీ లతబాలాజీ అన్నారు. మంగళవారం వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఎంపీపీ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులు కలసి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటికే ప్రభుత్వం అన్ని గ్రామాల్లో మౌళిక వసతులు కల్పించడం జరిగిందన్నారు. అలాగే సీసీ రోడ్లు నిర్మాణం కూడా 98శాతం పూర్తి అయినట్లు ఎంపీపీ పేర్కొన్నారు. అలాగే మూడు నెలలకు ఒక్క సారి జరిగే మండల సర్వసభ్యసమావేశానికి కూడా అధికారులు గైరహాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సామవేశానికి హాజరు కానీ అధికారులకు నోటీసీ జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం ఎంపీడీవో మోహన్‌మురళి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి పంచాయతీల వారీగా గ్రామాల అభివద్ధికి మంజూరు చేసిన రూ.20 లక్షలను కొంత మంది సర్పంచ్లు గ్రామాల అభివద్ధిపై చొరవ చూపకుండా నిధులు వారి ఖాతాల్లో మురుగుతున్నాయని, ఇప్పటికైనా స్పందించి అభివద్ధి పనులను వేగవంతం చేసి ఖాతాలో ఉన్న నిధులను ఖర్చు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లేని పక్షంలో నిధులు వెనెక్కి వెళ్లే అవకాశం ఉందన్నారు. గాజంకిలో అంగన్వాడీ కేంద్రం శిధిలావస్థలో ఉందని సమావేశం దష్టికి తీసుకు రావడంతో స్పందించిన ఎంఈవో విజయకుమార్‌ నాడు-నేడు పథకం ద్వారా త్వరలో ఆధునీకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. కొల్లాగుంట రైతు భరోసా కేంద్రంలో కూడా ఎరువులు అందుబాటులో ఉంచాలని ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసులురెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ధనంజయవర్మ, వైస్‌ ఎంపీపీ మణెమ్మ, కోఆప్షన్‌ మెంబర్‌ పట్నం ప్రభాకర్రెడ్డి, ఎంఈవొ 2 మనోజ్కమార్‌, సీడీపీవౌ పద్మసునంద, డాక్టర్‌ గోపినాధ్‌. పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించండి- మండల సమావేశంలో అధికారులను నిలదీసిన సర్పంచులుప్రజాశక్తి-గంగవరం: స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల సమావేశంలో సర్పంచ్‌లు ముక్కుమడిగా అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక వసతులపై అధికారులను నిలదీశారు. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నపిల్లలకు మరుగుదొడ్లు కానీ ఇతర మౌలిక సదుపాయాలు కానీ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని, చిన్న పిల్లలు బహిరంగ ప్రదేశంలో వెళ్లి మూత్ర విసర్జన చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అధికారుల దష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన అధికారులు వెంటనే పై అధికారులకు నివేదిక అందజేస్తామని తెలియజేశారు. అన్ని శాఖల అధికారులు సంబంధించిన స్థితిగతులను శాఖల వారిగా వివరించడం జరిగింది. కార్యక్రమంలో ఎంపీడీవో మధుసూదన్‌రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

➡️