మంచు కురిసే వేళలో…

మంచు కురిసే వేళలో...

ఉదయం ఎనిమిది గంటలైనా కమ్ముకున్న మంచు తెరలు తొలగడం లేదు. కోటబొమ్మాళి, కొత్తపేటతో పాటు పరిసర గ్రామాల్లో రోడ్డెక్కితే ఎదురుగా ఏమొస్తుందో తెలియని విధంగా పొగ మంచు దారులను కమ్మేసింది. దీంతో ఎదురుగా ఏ వాహనం వస్తుందో తెలియని పరిస్థితుల్లో వాహనచోదకులు లైట్లు వేసుకుని మరీ వెళ్లాల్సి వచ్చింది. వేకువజాము నుంచి క్రమేణా పెరిగింది. 8.30 గంటల వరకు సూర్య కిరణాలు రాకుండా మంచు తెరలు కమ్మేశాయి.

– ప్రజాశక్తి, కోటబొమ్మాళి

➡️