భాషా వాలంటీర్ల ర్యాలీ

ర్యాలీ చేపడుతున్న భాషా వాలంటీర్లు

ప్రజాశక్తి -డుంబ్రిగుడ: ఐటిడి పరిధిలోని జిపిఎస్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న బాషా వాలంటీర్లను విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెన్యువల్‌ చేసి జీతాలు పెంచాలని కోరుతూ మండల కేంద్రంలోని మూడు రోజుల జంక్షన్‌ నుంచి ఎంఈఓ కార్యాలయం వరకు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంఈఓ ఎస్‌.సుందర్‌ రావుకు అందజేశారు. అనంతరం ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు పి.కుమారి మాట్లాడుతూ, ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలను రూ 26 వేలకు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెన్యూవల్‌ అయ్యే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష కార్యదర్శులు పి.బుజ్జిబాబు, టి.సత్యనారాయణ, ఎం.సింహాచలం, దస్మత్‌, సుశీల పాల్గొన్నారు.పెదబయలు:ఏటిడబ్ల్యుఒ స్వర్ణలతకు ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాన మాతృ భాష వాలంటీర్లు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల అధ్యక్షులు వీరయ్య మాట్లాడుతూ, విద్యా సంవత్సరం ప్రారంభం నుండి కొనసాగించి కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం మండల కార్యదర్శి కే.శర్బన్న, అధ్యక్షులు బి గంగాధరం, ఆదివాసి జిల్లా కమిటీ సభ్యులు సునీల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

➡️