భవన నిర్మాణ కార్మికుల ధర్నా

భవన నిర్మాణ కార్మికులు

ప్రజాశక్తి -గాజువాక : సమస్యల పరిష్కారానికి గాజువాకలో సిఐటియు ఆధ్వర్యాన భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేశారు.ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా కార్యదర్శి బి శ్రీను, గాజువాక జోన్‌ అధ్యక్షులు డి రమణ మాట్లాడుతూ, వైసిపి ప్రభుత్వ విధానాలతో భవన నిర్మాణ కార్మికరంగం అంధకారంలోకి నెట్టబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో రూ.1280కోట్ల సంక్షేమబోర్డు నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో భవన నిర్మాణ కార్మికుల సత్తా ఏంటో ముఖ్యమంత్రి జగన్‌కు చూపిస్తామని హెచ్చరించారు. కార్మికుల సంక్షేమానికి కట్టుబడిన వారికే ఓటేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలోఎం.నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, చిట్టిబాబు, ఇమ్మాన్యుయేల్‌ పాల్గొన్నారు.రాంబిల్లి : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండలంలో భవన నిర్మాణ కార్మికులు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి.దేవుడునాయుడు, భవన నిర్మాణ సంఘం నాయకులు ఎస్‌.రాంబాబు, చందక రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గడిచిన ఐదేళ్ల కాలంలో భవన నిర్మాణ వెల్ఫేర్‌ బోర్డు నుండి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల కోసం ఆలోచించని,పార్టీల కోసం వచ్చే ఎన్నికల్లో తాము ఆలోచిస్తామని హెచ్చరించారు. కశింకోట : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి అందవలసిన సంక్షేమ పథకాలు తక్షణమే ఇవ్వాలని కోరుతూ మండలంలోని నర్సింగబిల్లి సచివాలయం వద్ద నిరసన చేపట్టారు కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు దాకారపు శ్రీనివాసరావు, యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రమణ, ఎం. గోవింద, నాయకులు కె.వంశీకృష్ణ, టి.రమణ, కె.రాజు, ఎన్‌.చిన్నారావు, కె.కృష్ణ, సిహెచ్‌.పెంటయ్య, ఎ.అప్పలస్వామి నాయుడు పాల్గొన్నారు.అనకాపల్లి : భవన నిర్మాణ సంక్షేమ బోర్డుకు తూట్లు పొడిచి కార్మికులకు సంక్షేమ ఫలితాలు అందకుండా చేసిన జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఏఐటీయూసీ అనకాపల్లి జిల్లా కన్వీనర్‌ వైఎన్‌ భద్రం పిలుపునిచ్చారు. శుక్రవారం మామిడి పాలెంలోకార్మికుల సమావేశంలో మాట్లాడుతూ దారి మళ్లించిన నిధులు తిరిగి సంక్షేమబోర్డుకు జమచేయాలని కోరారు. సమావేశంలో సంఘం నాయకులు గోపాలం మహాలక్ష్మి, మిత్తిపాటికాశి అప్పారావు పాల్గొన్నారు.

ధర్నాలో మాట్లాడుతున్న డి రమణ

➡️