బంగారం కొనలేరు..!-రూ.69 వేలు పైనే..

Mar 21,2024 21:10 #Business

న్యూఢిల్లీ : బంగారం ధర పరుగులు పెడుతోంది. సామాన్యులు పసిడిని కొనలేని స్థాయికి ఎగిసింది. పది గ్రాముల బంగారం రూ.69వేల చేరువలో నమోదయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్‌ పెరగడంతో దేశీయంగాను ధరలు ఎగిసిపడుతున్నాయి. గుడ్‌రిటర్న్స్‌ ప్రకారం.. గురువారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.1,090 పెరిగి రూ.67,570కి చేరింది. దీనికి 3 శాతం జిఎస్‌టి కలిపితే రూ.69వేలు దాటుతోంది. 22 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.1,000 పెరిగి రూ.61,950 వద్ద ముగిసింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల అపరంజి ధర రూ.67,420గా, 22 క్యారెట్ల ధర రూ.61,800గా పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2208 డాలర్ల వద్ద, వెండి ధర 25.51 డాలర్ల వద్ద నమోదవుతోంది. వడ్డీ రేట్లలో ఈ ఏడాది మూడు సార్లు కోత ఉంటుందని ఫెడ్‌ సంకేతాలు ఇవ్వడంతో డాలర్‌ డిమాండ్‌ తగ్గి.. బంగారానికి డిమాండ్‌ పెరిగిందని బులియన్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

➡️