ఫొటోలు, ఫ్లెక్సీలు, హోర్డింగుల తొలగింపు

Mar 18,2024 23:10
ఎన్నికల ప్రచారంలో

ప్రజాశక్తి – కాకినాడ

ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ రాజకీయ పార్టీల ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫోటోలు, హోర్డింగులను 72 గంటల్లోపు తొలగించడం జరుగు తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ జరిగేందుకు సహకరిం చాలని కలెక్టర్‌ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. ఎన్నికల షెడ్యూల్‌, ఓటర్ల జాబితా, ఎన్ని కలకు నియమించిన అధికారుల వివరాలు, ఫారం 6, 7, 8లకు సంబంధించి దాఖలైన దరఖాస్తుల పరిష్కారం, ఈ-ఎపిక్‌ కార్డులు పంపిణీ, పోలింగ్‌ కేంద్రాలు, ఇవిఎంలు, వివిపాడ్స్‌ వినియోగంపై ప్రజల కు అవగాహన, స్టోరేజ్‌ పాయింట్‌, కౌంటింగ్‌ కేంద్రాలు, కంట్రోల్‌ రూములు, ఎన్నికల ప్రవర్తన నియమావళి వంటి అంశాలపై కలెక్టర్‌ వారికి వివరిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తీసుకొచ్చిన మార్గదర్శకాలను, సూచనలను ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీ ప్రతినిధులకు సమావేశాలు నిర్వహించి వివరించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్చి 17 నాటికి మొత్తం 16,11,171 మంది ఓటర్లు ఉన్నా రన్నారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ రాజ కీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఎన్నికల నియమా వళిని ఉల్లంఘించే రాజకీయ పార్టీలు, వ్యక్తులపై చర్య తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్టంగా అమలుకు జిల్లాలో సి-వీజిల్‌ యాప్‌, పోలీస్‌, ప్లేయింగ్‌ స్క్వాడ్‌, స్టాటస్టిక్స్‌ సర్వేలన్స్‌ ఇతర బృందాలు నిత్యం పర్యవేక్షణలో ఉం టాయన్నారు. జిల్లాలో నిష్పక్షపాతంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతిని ధులు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో డిఆర్‌ఒ డాక్టర్‌ డి.తిప్పేనాయక్‌, రాజకీయ పార్టీల ప్రతినిధులు రావూరి వెంకటేశ్వరరావు (వైసిపి), గదుల సాయిబాబా(టిడిపి), సబ్బారపు అప్పారావు(బిఎస్‌పి), ఆకుల వెంకటరమణ (కాంగ్రెస్‌), సిహెచ్‌.రమేష్‌ బాబు(బిజెపి), వాసంశేట్టి చంద్రరావు (సిపిఎం), ఎన్ని కల విభాగం అధికారి ఎం.జగన్నాధం, పాల్గొన్నారు.

➡️