ఫిర్యాదు చేసినా దొంగ ఓట్లు తొలగించరా..?- ఆర్డీవో కార్యాలయం ఎదుట పులివర్తి నాని నిరసన దీక్ష- పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం

ఫిర్యాదు చేసినా దొంగ ఓట్లు తొలగించరా..?- ఆర్డీవో కార్యాలయం ఎదుట పులివర్తి నాని నిరసన దీక్ష- పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం

ఫిర్యాదు చేసినా దొంగ ఓట్లు తొలగించరా..?- ఆర్డీవో కార్యాలయం ఎదుట పులివర్తి నాని నిరసన దీక్ష- పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నంతిరుపతి టౌన్‌: చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన కుమారుని గెలిపించుకోవడానికి భారీగా దొంగ ఓట్లు నమోదు చేయించారని, వాటిని తొలగించమని పలుమార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదని టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. సోమవారం తిరుపతి ఆర్టీవో కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. పోలీసులు ఈ నిరసన దీక్ష శిబిరాన్ని భగం చేయడానికి ప్రయత్నించగా పులివర్తి నాని పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నించగా పోలీసులు నీళ్లు చల్లి అడ్డుకున్నారు. తర్వాత ఆయనను అదుపులో తీసుకున్నారు. అంతకు ముందు పులివర్తి నాని మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి ఓడిపోతారని భయంతోనే దొంగ ఓట్లు నమోదు చేశారని ఆరోపించారు. అడ్డదారిలో గెలిపించుకోవడానికి భారీ ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేశారని ఇటు జిల్లా ఎన్నికల అధికారులకు అటు రాష్ట్ర ఎన్నికల అధికారి ఫిర్యాదు చేసిన బోగస్‌ ఓట్ల తొలగించక పోవడం దారుణమన్నారు. బోగస్‌ ఓట్లను ఏరివేయాలని డిమాండ్‌ చేశారు. ఓటర్లు జాబితాపై ఇంత నిర్లక్ష్యమా.. సహకరిస్తున్న కొందరు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత 7నెలలుగా పోరాడుతున్నా పట్టించుకోక పోవడం ఏమిటని మండిపడ్డారు. ఎమ్మెల్యే సూచనలతో భారీగా బోగస్‌ ఓట్లు నమోదు చేశారన్నారు. అధికారులు ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వాలని సూచించారు. నిరసన కార్యక్రమానికి తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహ యాదవ్‌, శ్రీధర్‌ వర్మ, రవి నాయుడు, ఊక విజరు కుమార్‌, కార్పొరేటర్‌ మునికృష్ణ పాల్గొన్నారు.పులివర్తినానికి అస్వస్థత- చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపుపెట్రోల్‌తో ఆత్మహత్యకు యత్నించిన పులివర్తినానిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో పెద్దఎత్తున కార్యకర్తలు, పోలీసులు మద్య తోపులాట జరిగింది. నానికి పెట్రోల్‌ కళ్లలో పడి తోపులాటలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో టీడీపీ నాయకులు ఆయనను ఆసుపత్రికి తరలించారు.

➡️