ప్రశ్నాపత్రాలను పాఠశాలలకు చేర్చాలి

Jan 20,2024 21:11
ఫొటో : మాట్లాడుతున్న ఎంఇఒ మస్తాన్‌వలీ

ఫొటో : మాట్లాడుతున్న ఎంఇఒ మస్తాన్‌వలీ
ప్రశ్నాపత్రాలను పాఠశాలలకు చేర్చాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : జనవరి 23వ తేదీ నుండి నిర్మాణాత్మక మూల్యాంకనం 3 ఫార్మేటివ్‌ అసైన్‌మెంట్‌ ఎఫ్‌ఎ3 పరీక్షల నేపథ్యంలో ఉదయగిరి ఎంఇఒ-1 షేక్‌.మస్తాన్‌ వలీ పర్యవేక్షణలో క్లస్టర్‌ రిజర్వ్‌ మొబైల్‌ టీచర్స్‌ సిఆర్‌ఎంటిలు క్వశ్చన్‌ పేపర్‌ బండిల్స్‌, ఒఎంఆర్‌ షీట్స్‌ బండిల్స్‌ను పరీక్షలరోజు పాఠశాలల చేర్చాలన్నారు. ఈ క్వశ్చన్‌ పేపర్‌ బండిల్స్‌, ఒఎంఆర్‌ షీట్స్‌ బండిల్స్‌ను గ్రేడింగ్‌ ప్యాకింగ్‌ చేసి ఎంఇఒ కార్యాలయంలో భద్రపరుస్తామన్నారు. ఈ సందర్భంగా ఎంఇఒ మాట్లాడుతూ జనవరి 22వ తేదీ సోమవారం ప్రతిఒక్క సిఆర్‌టిఎంలు తమతమ పాఠశాలల సముదాయాలకు జాగ్రత్తగా క్వశ్చన్‌ పేపర్స్‌ ఒఎంఆర్‌ షీట్స్‌ తీసుకెళ్లి పాఠశాలల సముదాయ చైర్మన్‌ అయిన ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అప్పగించాలని తెలియజేశారు. ఉదయగిరి మండలంలోని అన్ని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమతమ పాఠశాలల సముదాయాల నుండి జనవరి 23వ తేదీ నుండి జరిగే ఎఫ్‌ఎ3 పరీక్షలకు సంబంధించి ఏ రోజు పరీక్షకు ఆరోజు పాఠశాలల సముదాల నుండి ప్రశ్నపత్రాలు తీసుకువెళ్లాలని సూచించారు.

➡️