ప్రత్తిపాడు వైసిపి టికెట్‌ వరపులకేనా?

Dec 19,2023 23:45
సమన్వ యం కోల్పో యారని ఆరోపణతో

ప్రజాశక్తి – ఏలేశ్వరం

ప్రత్తిపాడు నియోజక వర్గ వైసిపి టికెట్‌ విషయంలో పలు మార్పులు చోటుచేసు కుంటు న్నాయి. సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌ స్థానిక నాయకులతో సమన్వ యం కోల్పో యారని ఆరోపణతో ఆయనకు అధి ష్టానం టికెట్‌ లేదని సంకేతాలు ఇచ్చింది. తొలుత ఎంఎల్‌ఎ సమీప బంధువు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి అన్న కుమార్తె పర్వత జానకి దేవికి టికెట్‌ ఇస్తారని సోషల్‌ మీడియాలో పుకార్లు షికారులు చేశాయి. అయితే అనూహ్యంగా తాడేపల్లి పాలస్‌ నుంచి మాజీ ఎంఎల్‌ఎ, వైసిపి సీనియర్‌ నేత వరుపుల సుబ్బారావుకి సోమవారం సాయంత్రం ఫోన్‌ రావడంతో అందరు అంచనాలు తారుమ రయ్యాయి. వరుపుల సుబ్బారావు గతంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎంఎల్‌ఎగా విజయం సాధించారు. 2014లో వైసిపి నుంచి రెండోసారి ఎంఎల్‌ఎగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా పర్వత ప్రసాద్‌ బరిలో నిలిచి టెక్కెట్‌ను తెచ్చుకుని విజయం సాధించారు. ఆయన గెలుపులో వరుపుల సుబ్బరావు కీలకపాత్ర పోషించారు. సీని యారిటి, పార్టీ విజయంలో కీలక పాత్రలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌ ఛార్జ్‌గా వరుపుల ను నియమిం చేందుకు పార్టీ అధి ష్టానం నిర్ణయం తీసు కున్నట్లు ప్రచా రం జరుగు తోంది. సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ పర్వత ప్రసాద్‌ ఆయన సమీప బంధువు అయిన జానకి దేవికి ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలను అప్పగిం చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి నట్లు, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం సైతం వరుపుల సుబ్బారావుకి టికెట్‌ ఇవ్వాలని సూచించినట్టు సమా చారం. ఏదిఏమైనా ప్రత్తిపాడు వైసిపి టికెట్‌ విషయంలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుం టున్నాయి. దిగువ స్థాయి నాయకత్వం పర్వత ప్రసాద్‌కే టిక్కెట్‌ ఇవ్వాలని కోరుతుంది. ఇప్పటికే వరుపుల వెంట నడిచిన ఏలేశ్వరం, రౌతులపూడి ఎంపిపిలు, ఇతర ప్రజాప్రతి నిధులు టిడిపిలో చేరిపోయారు. వరు పులకు టిక్కెట్‌ను ఇస్తే వారు తిరిగి సొంతగూటికి చేరుకుంటారా? అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.

➡️