ప్రజా ఉద్యమ నేత అన్నే వెంకటేశ్వరరావు

సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం
ప్రజాశక్తి – భీమవరం
ఆదర్శప్రాయుడు, అమరజీవి, స్వాతంత్య్ర సమరయోధుడు రైతు, ప్రజా ఉద్యమ నేత అన్నే వెంకటేశ్వరరావు అని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అన్నారు. స్థానిక సుందరయ్య భవనంలో వెంకటేశ్వరరావు వర్థంతి వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి బలరాం పూలమాల వేసి నివా ళులర్పించి మాట్లాడారు. జిల్లాలో రైతు, వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని నిర్మించడంలో వెంకటేశ్వరరావు ప్రధాన పాత్ర పోషించారన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల్లో ఆయన ఒకరన్నారు. ఆయన జీవిత భాగస్వామి అన్నే అనసూయమ్మ కూడా జిల్లాలో మహిళా ఉద్యమాన్ని నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.వాసుదేవరావు, కార్యకర్తలు ఎం.ఆంజనేయులు, ఇంజేటి శ్రీనివాస్‌, రత్నకుమారి, డేగల నాగు పాల్గొన్నారు.

➡️